Paruchuri: వైరల్ అవుతున్న పరుచూరి సంచలన వ్యాఖ్యలు!

Paruchuri: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన యాక్న్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను తెగ మెప్పించింది. ఓటీటీలోనూ ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ చిత్రంపై తాజాగా సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ షాకింగ్ కామెంట్ చేస్తూ, రివ్యూ ఇచ్చాడు.

వీరసింహారెడ్డి మూవీ చూశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు నందమూరి తారకరామారావు చండశాసనులు మూవీ గుర్తొచ్చింది.
ఎందుకంటే రెండు సినిమాల కథాబీజం ఒకటే. అన్నా చెల్లెళ్ల మధ్య వైరం, అన్నయ్య నాశనమైపోవాలని శపించడం వంటివి రెండింటిలోనూ ఉంటాయి. వీరసింహారెడ్డిలో తాను కోరుకున్న వాడిని చంపించేశాడన్న కోపంతో అన్నయ్య శత్రువులింట్లో ఒకరితో తాళి కట్టించుకుని వాళ్ల సాయంతో సొంత అన్న మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది చెల్లెలు వరలక్ష్మి అని కథ గురించి చెప్పుకొచ్చాడు.

 

ఫస్టాఫ్ చూసినంతసేపు ఇది బోయపాటి శ్రీను సినిమా చూస్తున్నట్లే అనిపించింది. ఫస్టాఫ్ బంగారంలా ఉంది. కానీ సెకండాఫ్ బంగారం, వెండికి మధ్యలో ఉన్నట్లు అనిపించన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక అది సడన్ గా కామ్ అయిపోయి చెల్లెలిని చూసి తోకాడిస్తే చూడబుద్ధి కాదు. అయినా అన్నా చెల్లెల అనుబంధమే ఈ సినిమాను కాపాడిందన్నాడు. రూ.130 కోట్లు వసూలు చేయగలిగిందన్నాడు.

 

కానీ ఇదే సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎలాగంటే.. పెద్ద బాలయ్య పాత్ర చనిపోయాక ఫ్లాష్బ్యా క్ చూపించారు.
ఎప్పుడైతే ఆయన పాత్ర చనిపోయాడని ప్రేక్షకులకు తెలిసిపోయిందో అప్పుడే ఒక నిరాశ వచ్చేస్తుంది. ఈ సినిమాలో ఉన్న ప్రాథమిక లోపం .. వీరసింహారెడ్డి పాత్రను ముగించి తర్వాత ఫ్లాష్బ్యా క్ చూపించడమన్నాడు పరుచూరి.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -