Parvathy Nair: నటి పార్వతి నాయర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇమేజ్ డ్యామేజ్ చేస్తే!

Parvathy Nair: సినీ ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటాయి. పుకార్లు, ఆరోపణ, ఎఫైర్స్‌ కు సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు వార్తల్లో ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. ఆ క్రమంలో సినీ తారలు మీడియాలపై ఫైర్ అవుతుంటారు. అయితే సినీ తారల పర్సనల్ విషయాలను పబ్లిక్ చేస్తే ఎవరికీ నచ్చదు. తమ ఇమేజ్ డ్యామేజ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు.

 

ఈ మధ్యకాలంలో నటి రష్మిక మందనా కూడా సోషల్ మీడియా ధోరణిపై తీవ్ర వ్యతిరేకత కనబర్చారు. తాజాగా నటి పార్వతి నాయర్ ఏకంగా వార్నింగే ఇచ్చింది. తమిళ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్న పార్వతి నాయర్.. ఇప్పటివరకు ఎన్నై అరిందాల్, ఉత్తమ విలన్, నిమిర్నిందు నిల్, సీతక్కాతి వంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించారు.

 

అయితే ఈ భామ చెన్నైలోని నుంగంబాక్కంలో నివసిస్తుంటారు. ఇటీవల ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లాప్‌టాప్, సెల్ ఫోన్ తదితర వస్తువులకు చోరికి గురయ్యాయి. దొంగతనం జరిగిన రోజే.. ఇంట్లో పని చేసే ఓ వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడని నటి పేర్కొంది. అయితే ఆమె ఇంట్లో పని చేసిన చంద్రబోస్ అనే వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు వచ్చాడు. నటి పార్వతి నాయర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించాడు.

 

ఇంట్లో ఎప్పుడూ పార్టీలు చేసుకుంటుందని, రాత్రి పూట మగ స్నేహితులతో మందు తాగుతుందని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వార్త పలు ఛానెళ్లలో ప్రసారమైంది. దీంతో ఆగ్రహానికి లోనైన నటి పార్వతి నాయర్ హెచ్చరించింది. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇష్టానుసారంగా వార్తలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటానని శనివారం మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడితే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించింది.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -