Paster: 10 రోజుల్లో చనిపోతా.. 3 రోజుల్లో బతికివస్తా.. ఓ పాస్టర్‌ వింత చేస్టలు..

Paster: టెక్నాలజీలో శరవేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో ఇంకా మూఢనమ్మకాలను చాలా మంది నమ్ముతూ ఇతరులను నమ్మిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. అంతరిక్షంలోనూ స్థిర నివాసాల కోసం కసరత్తు చేస్తున్న నేటి కాలంలో మూఢ నమ్మకాలను నమ్ముతున్నారంటే నమ్మశక్యంగా లేదంటున్నా విశ్లేషకులు ఎలాంటి రోగాలు వచ్చిన వాటిని మందులు కనిపెడుతూ ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కరోనా మందు సైతం కనిపెట్టిన కాలంలో మూఢనమ్మకాలతో వారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు, పల్లెల్లో వీటిని ఎక్కువగా నమ్మేవారు ఇప్పుడు బాగా చదువుకున్న వారు సైతం నమ్ముతున్నారు. గతేడాది మూఢనమ్మకాలను నమ్మిన ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్న భార్యభర్తలు వారి ముగ్గురి కూతుళ్లను బలిస్తే మళ్లీ పునర్జన్మ ఎత్తుతారని నమ్మి అతి కిరాతకంగా గొంతులు కోశారు. ఇలాంటి మూఢనమ్మకాలపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించినా కొందరిలో మార్పు రావడం లేదు.

 

భక్తి పేరిట కొందరు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. మూఢత్వాన్ని నూరిపోస్తుంటారు. తాజాగా జరిగిన ఘటనపై జనం భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్‌ తాను చనిపోయి మళ్లీ బతికి వస్తానని ఊరంతా ప్రచారం చేసుకోవడం కలకలం రేపింది. అతడి మాటలకు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గన్నవరానికి చెందిన నాగభూషణం గత కొన్నాళ్లుగా పాస్టర్‌ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గొల్లనపల్లిలో తన సొంత స్థలంలో సమాధి కోసం గుంతాను తవ్వించుకున్న ఆయన 10 రోజుల్లో తాను చనిపోతానని తన దేహాన్ని ఇదే గొయ్యిలో పూడ్చిపెట్టాలని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కోరారు. చనిపోయిన మూడు రోజుల తర్వాత తాను మళ్లీ బతికి వస్తానని పేర్కొంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను గ్రామంలో కట్టించాడు. దీంతో అతడి చేష్టలకు గ్రామస్తులు విస్తుపోతున్నారు. నాగభూషణం మానసిక స్థితి దెబ్బతిన్నదని, అతనికి చికిత్స చేయించాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు కృష్ణా జిల్లాలో కలకలం రేపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Posani Krishna Murali: ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అనే కామెంట్లు.. పోసాని విమర్శల్లో కొంచమైనా అర్థముందా?

Posani Krishna Murali: రాజకీయాల అన్నాక ఒక పార్టీని మరొక పార్టీ విమర్శించడం నేటి రోజుల్లో కామన్. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి జగన్ దగ్గర ఎలాంటి కంటెంట్ లేకపోవడంతో ఆయన భార్యల...
- Advertisement -
- Advertisement -