PavitraLokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అభిమానుల కన్నీటి వీడ్కోలుతో కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో ప్రశాంతంగా ముగిశాయి. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలను కృష్ణ కొడుకుగా మహేష్ బాబు దగ్గరుండి శాస్త్రోత్తంగా నిర్వహించాడు.
అయితే కృష్ణ అంత్యక్రియల్లో జరిగిన ఓ విషయం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. కృష్ణ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో నటుడు నరేష్ చేసిన అతి, పవిత్రా లోకేష్ చేసిన ఓవరాక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు కృష్ణ చనిపోయారని పుట్టెడు దు:ఖంలో అందరూ ఉంటే వీళ్లు మాత్రం ఛండాలంగా ప్రవర్తించారని అందరూ విమర్శిస్తున్నారు.
కృష్ణ అంత్యక్రియలకు నరేష్ తో పాటు వచ్చిన పవిత్రా లోకేష్ అతి చేసిందనే టాక్ వినిపిస్తోంది. నరేష్ కు పవిత్రా లోకేష్ సైగలు చేస్తూ నీళ్లు తాగుతావా అన్నట్లు అడగడం వీడియోల్లో కనిపించింది. అలాగే ఇంకా ఇక్కడ ఎంతసేపు ఉండాలి అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం కూడా కొందరు గమనించారు. ఇలాంటి ఛండాలమైన పనులు ఎవరైనా చేస్తారా అని ఆమె మీద అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు.
మోహన్ బాబు.. కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక ఏడుస్తుంటే.. పవిత్రా లోకేష్ దారుణమైన ఎక్స్ ప్రెషన్లు పెట్టిందని అందరూ ఆగ్రహిస్తున్నారు. పవిత్రా లోకేష్.. ఈయన ఇంకెంత సేపు ఏడుస్తాడ్రా బాబు అన్నట్టే ఫేస్ ఎక్స్ ప్రెషన్లు పెట్టింది. అవి చూసిన వారంతా పవిత్రా లోకేష్ ఇలాంటి మనిషా అంటూ కోపగించుకుంటున్నారు. మహేష్ కుటుంబాన్ని ఓదార్చాల్సిందిపోయి.. పవిత్రా లోకేష్ దరిద్రంగా ప్రవర్తించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.