Pavitra Lokesh-Naresh: పవిత్ర లోకేశ్ నరేష్ పెళ్లి ఫిక్స్.. ఆరోజే చేసుకుంటామంటూ?

Pavitra Lokesh-Naresh: తెలుగు ప్రేక్షకులకు నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొంతకాలంగా విరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలపై అవాస్తవాలే అంటూ కొట్టి పారేసింది ఈ జంట. అటువంటివన్నీ ఏమీ లేదంటూనే ఎక్కడ కనిపించినా కూడా జంటగా కనిపించారు. దీంతో చాలామంది వీరిపై ట్రోలింగ్స్ కూడా చేసిన విషయం తెలిసిందే.

 

పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల పై నరేష్ మాజీ భార్య స్పందిస్తూ.. పవిత్ర లోకేష్ నరేష్ ల బంధం గురించి మీడియా ముందు మాట్లాడుతూ నానా రచ్చ చేసింది. ఇది ఇలా ఉంటే నరేష్ పవిత్ర లోకేష్ కి సంబంధించిన ఏదో ఒక వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వీరికి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. అదేమిటంటే న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన నరేష్ సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేశాడు.

 

ఆ వీడియోలో కేక్ కట్ చేసి పవిత్ర లోకేష్,నరేష్ ఇద్దరు లిప్ లాక్ కూడా పెట్టుకున్నారు. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని తెలిపాడు నరేష్. అయితే పెళ్లి ఎప్పుడు అన్నది మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే ఉంటుంది అని అర్థమవుతోంది. అయితే ఎప్పటినుంచో నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్న విధంగానే ఈ జంట ఎట్టకేలకు ఒకటి కాబోతున్నారు. ఈ వార్తలపై స్పందించిన పలువురు నెటిజన్స్ వారిపై ట్రోలింగ్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -