Pawan-Harish Shankar: పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ అలా ఉంటుందా?

Pawan-Harish Shankar: ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. భారీ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి స్టోరీతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ త్వరగా పూర్తి చేసి.. థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ నెట్టింట వైరల్ అవుతోంది.

 

 

అయితే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘తేరీ’ సినిమా రీమేక్‌గా రాబోతుందని ప్రచారం జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను చెయొద్దని ఆరోపించారు. దీనిపై చిత్రబృందం కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా స్టోరీపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా మూవీకి సంబంధించిన స్టోరీ లైన్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తేరీ సినిమాకు రీమేక్‌గానే వస్తుందట. కాకపోతే కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉంటాయని, మిగిలిన స్టోరీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’కు సంబంధించినదే ఉంటుందని టాక్.

 

 

అయితే తేరీ సినిమాలో హీరో విజయ్ బేకరీ ఓనర్ పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తాడట. ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించారో అలాగన్నమాట. ప్రొఫెసర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్.. ఫ్లాష్ బ్యాక్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎలా కనిపిస్తాడు. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్.. ప్రొఫెసర్ ఎలా అయ్యాడు.? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు.? సమస్యలపై ఎలా పోరాటం చేశాడనే నేపథ్యంలో స్టోరీ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రీమేక్ కంటే కొంచెం కొత్తగా స్టోరీ ఉంటుందని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -