Pawan Kalyan: పవన్ ఫిక్స్ అయిన సీట్లు ఇవే.. జనసేన పార్టీ పోటీ గురించి క్లారిటీ వచ్చినట్టేనా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా టిడిపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లను చంద్రబాబు నుంచి అడిగి తీసుకున్నారు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పెళ్లికి సీట్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్టు గట్టి నిర్ణయంతో ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జనసేన నేతలతో కలిసి జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నేతలకు కాస్త కలవరపాటుకు గురిచేసిన పవన్ మాత్రం పక్క ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఒంటరిగా పోరాటం చేసిన 40 సీట్లు తప్పకుండా గెలుస్తానని ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇలా 40 సీట్లు గెలుస్తానని పవన్ దీమా వ్యక్తం చేయడంతో ఆయన తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కూడా 40 సీట్ల వరకు ఆశించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

ఇలా ఒంటరిగా పోరాటం చేసిన మేము 40 సీట్లు గెలుస్తామని కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి రాబోతున్నాం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే పలు సందర్భాలలో సర్వేలు చేయించిన పవన్ కళ్యాణ్ 2009 ప్రజారాజ్యం పార్టీలో గెలిచిన స్థానాలను కూడా ఫోకస్ చేసే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: కాంగ్రెస్ గెలుపు అక్కర్లేదు.. వైసీపీ ఓడితే చాలు.. షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా?

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఆదరణ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు పీకల వరకు కోపం...
- Advertisement -
- Advertisement -