Pawan Kalyan: పవన్ సినిమా అంటే ఫైనాన్షియర్లు అలా అన్నారా?

Pawan Kalyan: థియేటర్లలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. సినిమా షూటింగ్ సమయం నుంచే ఆ సినిమా డిమాండ్ ఓ స్థాయికి పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కొనేందుకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పోటీ పడుతుంటారు. లక్షల రూపాయలు అడ్వాన్సులు ఇస్తూ.. పవన్ సినిమాను తమ థియేటర్లలో రిలీజ్ చేయాలని వేడుకుంటూ ఉంటారు. పవన్ సినిమా వచ్చిందంటే ఫైనాన్స్ కి కూడా కొదవే ఉండదు అన్నది అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

 

 

పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతోందని తెలిసినా.. అటు వైపు ఫైనాన్షియర్లు చూడని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ సినిమా రీమేక్ చేయనున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతి నిండా సినిమాలున్నాయి. కానీ ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈలోగా పూర్తి చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారనే విషయం కూడా తెలియదు. సినిమా షూటింగ్‌కు ఎప్పుడు టైం కేటాయిస్తారు. ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందనేది ఎవరికీ తెలియదు.

 

 

కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సినిమా చేయనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో జరగనుంది. కానీ ఫైనాన్షియర్లు పవన్ సినిమా అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. మైత్రీ మూవీ బ్యానర్‌పై పవన్ సినిమా తెరకెక్కుతున్నా.. ఫైనాన్షియర్లు ఎవరూ డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు. అయితే ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో.. ‘వీరసింహారెడ్డి, ఖుషి, వాల్తేరు వీరయ్య, పుష్ప-2, అమిగోష్’ సినిమాలున్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఈ సినిమాలకు బడ్జెట్ కేటాయించడానికే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తలమునకలు అవుతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫైనాన్షియర్లు ముందుకు రాకపోవడంతో మైత్రి మూవీ మేకర్స్‌ కు కష్టాలు తప్పడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ సినిమాకు ఫైనాన్షియర్లు ముందుకు దూసుకుంటూ రావాలి. కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక.. వెనక్కి పారిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -