Pawan Kalyan: సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పవన్ కళ్యాణ్.. మరీ సినిమా పేరు కూడా తెలీదా అంటూ?

Pawan Kalyan: రాజకీయాల హడావుడిలో, తెలుగుదేశం, జనసేన పొత్తులపై తెగ బిజీగా ఉన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంగా కాకుండా సినిమాల పరంగా తెగ రోల్స్ కి గురవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే తెలుగులో ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఆ స్పీచ్ లో తన సినిమా నిర్మాతల గురించి మాట్లాడాడు.

వకీల్ సాబ్ దర్శకుడు దిల్ రాజు, సర్దార్ భగత్ సింగా.. ఏదో ఉంది సినిమా పేరు భగత్ సింగ్ అని గుర్తొస్తుంది. ఆ సినిమా నిర్మాత నవీన్ నుంచి మంచి మద్దతే ఉంది అంటూ చెప్పుకొని వచ్చాడు. ఈ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ అని చెప్పింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి. మొదట్లో ఈ సినిమా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో మొదలైంది.

ఇదే పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు కానీ ప్రాజెక్టు ముందుకు కదలకపోవటంతో కొన్నాళ్ళకి ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ మార్చారు. ఓటింగ్ కూడా మొదలుపెట్టారు కానీ ఎందుకో ఇది కూడా ముందుకి కదలడం లేదు. ఇలా సొంత సినిమా పేరు పవన్ కళ్యాణ్ మర్చిపోవటంతో ఫ్యాన్స్ ట్రోల్స్ కి గురయ్యాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి పేరైనా తడబడుతూ చెప్పాడు.

మరొక సినిమాని పూర్తిగా మరిచిపోయాడు అదే హరిహర వీరమల్లు. మూడు నాలుగు ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కన పెట్టేసాడు. షూటింగ్ 50 శాతానికి పైన పూర్తయింది కానీ అది ఎందుకో మూలన పడిపోయింది కారణం ఎవరికీ తెలియదు. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మతిమరుపు గురించి మాత్రం ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -