Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ సమయంలో పార్టీకి ఎలాంటి డామేజ్ జరగకూడదని పార్టీ జనాలకు ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. అదేమిటో చూద్దాం. పార్టీ లీడర్లు ఎవరు ఏ ప్రైవేట్ ఇంటర్వ్యూలూ ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఏదో ఒక పాయింట్ లో నోరు జారి ఏదైనా మాట్లాడితే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుందని పవన్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ లీడర్లకు ఈ విషయం పై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేన కమిటీ డైలీ ఉదయాన్నే సమావేశమై ఆరోజు ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, ముందు రోజు జరిగిన ప్రచారం యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనేది డిస్కషన్ చేస్తుంది.

అలాగే ఇంటర్వ్యూల సంగతి కూడా పార్టీ చూసుకుంటుంది కాబట్టి మీరు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇవ్వద్దని ఆదేశించారట పవన్ కళ్యాణ్. అయితే ఈ ఆదేశాలు పార్టీ లీడర్లు పాటిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి లో వచ్చిన మార్పును చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందు లేని మెచ్యూరిటీ, ఇంతకుముందు లేని ఓపిక, శ్రమ ఆయనలో కనిపిస్తున్నాయి. ఇటు పిఠాపురంలో తిరుగుతూనే జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

నిజానికి ఆయనకి ఆరోగ్యం సహకరించడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన రెకరెంట్ ఇన్ ఫ్లూయెంజాతో బాధపడుతున్నారు, అలాగే పిఠాపురం టూర్ లో హై ఫీవర్ వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆయన పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేయడం, ప్రత్యర్ధులపై విజ్ఞతతో కూడిన విమర్శలు చేయడం వంటివి చూస్తుంటే పవన్ కళ్యాణ్ లో పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -