Pawan kalyan: చిరంజీవి విషయంలో మోహన్ బాబును అవమానించిన పవన్?

Pawan kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఈ వివాదాలు చిరికిచిరికి చాటంత అవుతూ ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో మెగా కుటుంబానికి, మంచు కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య తరచూ ఏదో ఒక విషయం గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే మోహన్ బాబు గత 16 సంవత్సరాల క్రితం చిరంజీవిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే తనని ఎవరైనా విమర్శిస్తే చిరంజీవిని పెద్దగా పట్టించుకోరు. కానీ చిరంజీవిని ఎవరైనా అవమానిస్తే ఇతరులు మాత్రం  సంతోషపడుతుంటారు. ఇలా మోహన్ బాబు 16 సంవత్సరాల క్రితం చిరంజీవి విషయంలో ఎంతో అవమానకరంగా మాట్లాడారంట.అయితే చిరంజీవి అవమానించడంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మోహన్ బాబుకు తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
చిరంజీవికి 2006 వ సంవత్సరంలో పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా ఓ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా మోహన్ బాబు వేదికపైకి వెళ్లి చిరంజీవి గురించి అవమార్యాదకరంగా మాట్లాడారు. మోహన్ బాబు ఇలా మాట్లాడటంతో మెగాస్టార్ ముఖం నొచ్చుకున్నారు. అయితే ఇది చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే వేదిక పైకి ఎక్కి తన స్టైల్లో మోహన్ బాబుకు కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ వేదికపైకి తమ్ముడు.. మోహన్ బాబు అంటూ స్పీచ్ మొదలుపెట్టాడు. ఇలా మోహన్ బాబు స్పీచ్ మొదలుపెట్టేసరికి చిరంజీవి మొహంలో ఆనందానికి అవధులు లేవు. మోహన్ బాబుకు ముచ్చెమటలు పట్టిస్తూ తన అన్నయ్య పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి తన తమ్ముడినీ ప్రోత్సహించేలా ప్రవర్తించి సంతోషపడ్డారని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -