Pawan Kalyan: పవన్ ఎలాంటి వ్యక్తో తెలియాలంటే ఈ బుక్ చదవాల్సిందే!

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు ప్రచారం జరగడంతో.. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రచారంలో జోరు పెంచాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ.. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్‌పై రాసిన ఓ పుస్తకం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పవన్ కళ్యాణ్ గురించిన పూర్తి సమాచారం ఈ పుస్తకంలో దొరకుతుందని, ఈ పుస్తకం చదివితే ఎంత గొప్ప వ్యక్తో తెలుస్తుందని చెబుతున్నారు.

 

 

రైటర్ గణ.. పవన్ కళ్యాణ్‌పై రాసిన పుస్తకం ‘ది రియల్ యోగి’. ఈ పుస్తకాన్ని మెగా బ్రదర్ నాగబాబు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు, సీనియర్ నటులు, దర్శకుడు బాబీ, నిర్మాత విశ్వప్రసాద్, రచయిత తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు పుస్తకానికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. ఈ పుస్తకాన్ని చదివితే పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తో తెలుస్తుందని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘కామన్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూవ్‌లో గణ పుస్తకాన్ని అద్భుతంగా రాశారు. పవన్ కళ్యాణ్ గురించి నేను ఏం అనుకుంటున్నానో.. ఈ పుస్తకం దగ్గర దగ్గరగా అలానే ఉంది. ఈ పుస్తకాన్ని చదివినప్పుడు నాకు ఇంకా నచ్చింది. పవన్ కళ్యాణ్ గ్రేట్ మోటివేటర్. మనిషిగా పుట్టి పెరుగుతున్నాం. మనం జీవించామా.. చనిపోయామా? అనే బతుకుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఒక లక్ష్యం పెట్టుకుని జీవిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది పదవుల కోసం కాదు. డబ్బుల కోసం కాదు. సామాన్యుల ఇబ్బందులు భరించలేక.. అవినీతి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికే జనసేన పార్టీ పెట్టాడు. తాను సంపాదించిన డబ్బు మొత్తం పార్టీ కోసం, ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. పైసా కూడా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌ది. భవిష్యత్ గురించి ఆలోచన ఉండదు. ఇవన్నీ ఒక మనిషికి ఉండే లక్షణాలు కావు.. పవన్ కళ్యాన్ నాకు ఒక యోగిలా కనిపిస్తుంటాడు.’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -