HHVM: హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదా?

HHVM: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. పాలిటిక్స్ మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్. వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం కోసం ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను చకచగా పూర్తి చేస్తున్నారు. అయితే పార్టీ అవసరాల కోసం డబ్బులు కావాల్సి ఉందని అందుకే తాను సినిమాలలో నటిస్తున్నట్టు ఏకంగా పవన్ కళ్యాణ్ నే స్వయంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ వినోదయ సీతం రీమేక్ లో పవన్ తన పార్ట్ షూటింగ్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ మొదటి వారం నుండి హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో పాల్గొనబోతున్నారు పవన్. తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. ఆ షెడ్యూల్ పూర్తి చేసిన తరువాత మళ్లీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని సినిమాల విషయం గురించి పవన్ కళ్యాణ్ బాగానే ఆలోచిస్తున్నాడు. ఒక్క హరిహర వీరమల్లు సినిమా గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవడమే మానేశారు. ఈపాటికి పవన్ అనుకుంటే ఈ సినిమా ఎప్పుడో పూర్తయి ఉండేది.

 

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఏఎం రత్నం 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా పట్ల అంతగా చొరవ చూపించడం లేదు. ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమా పట్ల పవన్ కళ్యాణ్ ఆసక్తిని చూపించకపోవడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టర్ క్రిష్ పైన పవన్ కళ్యాణ్ పగ పట్టారా అందుకే ఇలా చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఈ సినిమాను పట్టించుకోవడం లేదా అసలు ఈ సినిమా చేసే ఆలోచన ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -