Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి మనందరికీ తెలిసిందే. సమాజంలో మార్పు తీసుకురావాలనే..రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోరాడుతున్నాడు. ప్రజలకు ఏదో ఒక విధంగా మెరుగుపడేలా చేయాలని చూస్తున్నాడు. రాష్ట్రంలో మొత్తం సమానత్వాన్ని నింపాలనే గేయంతో పవన్ పోరాడుతున్నాడు.
నిజానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తన రోజులో చాలా గంటలు.. పార్టీ కోసం, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆపదలో ఉన్న వారికీ ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన మంచితనాన్ని ఒక రేంజ్ లో చాటుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జనసేన జెండాని పాతాలని కసిగా పట్టుపట్టాడు. ఇక మాజీ స్పీకర్ జనసేన రాష్ట్ర పిఏసి చైర్మన్ నాదేండ్ల మనోహర్ మనందరికీ తెలిసిన వాడే. ఇతడు పార్టీ లో చాలా పెద్ద సీనియర్ నాయకుడు.
ఇతడు పల్నాడు జిల్లా కొల్లిపరలో మీడియా సమావేశం తో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అన్నట్లు తెలిపాడు. రాష్ట్రంలో కొల్లిపర మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నా వంతు సహాయం నేను చేస్తాను అని నాదేండ్ల మనోహర్ చెప్పుకువచ్చాడు. ఇక నాదేండ్ల మనోహర్ జనసేన లో సీనియర్ అధినేత అయినప్పటికీ ఇతర పార్టీల మీద పోటీ పడడు. అంతేకాకుండా పోరాటం కూడా చేయడు.
కనీసం ఇతర పార్టీలపై ఒక చిన్న విమర్శ కూడా చేయడు. జనసేన పార్టీ తరఫున ఒక పవన్ కళ్యాణ్ గొంతు తప్ప మరి ఏ అధినేత గొంతు కూడా వినిపించదు. మరి జనసేన పార్టీలో ఉన్న నాయకులు పార్టీని బలపడే విధంగా చేయకుండా ప్రభుత్వంతో పోరాడకుండా ఉంటే జనసేన ఎలా గెలుస్తుంది. అప్పుడప్పుడు మీడియాతో నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతే సరిపోతుందా అని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటీ కోసం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ జనసేన మాత్రం అదే విధంగా కొనసాగుతుంది.