Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఈ స్థాయిలో ఉందా?

Pawan Kalyan: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ మరే హీరోకు ఉండదని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌లో సూపర్ హిట్స్ అందుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రేంజ్‌ను మాత్రం క్రాస్ చేయలేకపోతున్నారు. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలే. ఆ సినిమాలే పవన్ కళ్యాణ్‌ను ఆ హోదాలో నిలబెట్టాయి. అప్పట్లో ఆయన హీరోగా నటించిన సినిమాలను ఇప్పటి యువత చూసినా ఈజీగా ఫ్యాన్స్ అయిపోతారు. సాధారణంగా ఒక యువకుడు ఎలా ఉంటాడో.. పవన్ కళ్యాణ్‌ను బెస్ట్ ఎగ్జామ్‌ఫుల్‌గా చూపించవచ్చు.

 

 

అందుకే పవన్ కళ్యాణ్‌లో యూత్‌లో అంత క్రేజ్. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ ఏదంటే ‘ఖుషి’ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ రికార్డులతోపాటు ఇతర హీరోల రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో ‘ఖుషి’ సినిమాను మళ్లీ రి రిలీజ్ చేయాలని మెగాఫ్యాన్స్ అనుకున్నారు. వాళ్లందరి కోరికను నెరవేరుస్తూ.. ఖుషి సినిమాను ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ఏఎం రత్నం అధికారికంగా ప్రకటించాడు. దాంతో అప్పటినుంచి ‘హ్యాష్ ట్యాగ్ ఖుషి మూవీ’ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.

 

 

బుక్ మై షోలో ఖుషి మూవీ సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికి చాలా మంది సెర్చ్ చేస్తున్నారట. దాంతో ఇది ‘అవతార్-2’ సినిమాను కూడా వెనక్కి నెట్టి ‘ఖుషి’ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క ప్రకటనకే ఇంత సంచలనం సృష్టిస్తే.. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయితే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -