Pawan Kalyan-YS Jagan: జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మరో కొత్త కార్యక్రమం

Pawan Kalyan-YS Jagan: ఇప్పటికే జనవాణి, కౌలు రైతు భరోసా యాత్రలతో ప్రజల్లోకి జనసేన వెళుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. జనవాణి ద్వారా ప్రజల సమస్యలను లిఖితపూర్వకంగా తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా మృతి చెందిన కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సహాయం చేస్తోన్నారు.

 

ఈ క్రమంలో జనసేన మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 12,13,14వ తేదీల్లో జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని #jaganannamosam హ్యాట్ ట్యాగ్ ద్వారా జనసేన సోషల్ క్యాంపెయిన్ నడపనుంది. దీని ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టింది.

 

జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ తో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని సూచించింది. దీని వల్ల జగనన్న కాలనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలని జనసేన భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేదల ఇళ్ల పేరుతో భూములను ప్రభుత్వం సేకరించడం విషయంలో భారీగా అవినీతి జరగిందని జనసేన ఆరోపిస్తోంది. ఎక్కువ రేటుకు భూములు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తోన్నాయి.

 

అలాగే జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవని, కరెంట్, వాటర్ సౌకర్యం కల్పించ లేదు. డ్రైనేజీ పనులు కూడా జరగలేదు. దీంతో #JaganannaMosam అనే హ్యాష్ ట్యాగ్ కు ఫొటోలను జత చేసి 6304900820, 6304900658 నంబర్లకు పంపాలని జనసేన పార్టీ కోరింది. నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలనుఈ రూపంలో పంపాలని సూచించింది. పవన్ కల్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించి జగనన్న ఇళ్లను పరిశీలించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -