Pawan Kalyan: ప్రేమలో పడిన ఇద్దరి వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా వాళ్లే, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళిద్దరే ప్రపంచం అన్నట్లు బ్రతుకుతారు. జనసేన పార్టీ, తెదేపా పార్టీ కూడా మొన్న మొన్నటి వరకు అలాగే ఉండేది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీ కార్యక్రమాలలో జనసేన కార్యకర్తలు గాని నాయకులు గాని ఎక్కడా కనిపించడం లేదు.
నిజానికి పవన్ కళ్యాణ్ మెంటాలిటీ అందరికీ తెలిసిందే. ఆయన వ్యక్తిత్వం విచిత్రమైనది. ఎప్పుడు, ఎలా, ఎవరితో కలుపుగోలుగా ఉంటారో,ఎవరితో పగ ప్రతీకారంతో ఉంటారో చెప్పలేం. ఆయనకు గల ఈ విచిత్ర స్వభావం వలన పలువురు మహిళలు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రాజకీయాలలో కూడా ఆయన నిలకడలేని తనం ఆయనని ప్రజలకి దూరం చేస్తుంది.
అందుకే ఆ పార్టీ పెట్టి పదేళ్లయినా పవన్ కళ్యాణ్ ఇంతవరకు చట్టసభ గడప తొక్క లేని దయనీయమైన పరిస్థితి. అందుకే ఎలా అయినా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని గట్టి పంతం పట్టారు పవన్. సింగిల్ గా పోటీ చేయడం వలన అనుకున్న ఫలితాలు రావని గ్రహించారో,ఏమో. తెదేపా తో పొత్తుకుదుర్చుకోవడానికి సిద్ధపడ్డారు. తెదేపా, జనసేన రాజకీయ అవసరాల రీత్యా ఎన్నికలకు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. తెదేపా తో పొత్తుపై పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా విడుదల చేశారు.
ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తామంటూ ప్రకటించారు. ఒకటి రెండు రోజులు తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో జనసేన నేతలు పాల్గొన్నారు. కధ అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు. న్యాయస్థానాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి కనీసం ఒక ప్రకటన కూడా రాకపోవడం గమనార్హం. దీంతో ప్రేమ పక్షులు విడిపోయాయని ప్రచారం జోరందుకుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.