Pawan Kalyan: ఏపీ రాజకీయాలపై పవన్ సర్వే లీక్? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

Pawan Kalyan:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల సర్వే ఫలితాలను బయటపెట్టారు. ఆదివారం జనసేన లీగల్ సెల్ సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిణామాలపై కీలక విషయం బయపెట్టారు. ఏపీలోని ఎన్నికల సర్వేలను బయటపెట్టారు. ఏపీలోని సర్వేలన్నీ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయని, జనసేన బలపడుతుందని సర్వేలలో తేలిందన్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని కూడా పవన్ బయటపెట్టారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 45 నుంచి 67 సీట్లే వస్తాయని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్ల లోపే వస్తాయని సర్వేలలో తేలిందన్నారు.

అయితే ఇవి జనసేన పార్టీ తరపున చేయించిన సర్వేలా.. లేక మిగతా పార్టీలు చేయించిన సర్వేల రిపోర్టు వవన్ కు అందిందా.. లేక సర్వే ఏజెన్సీలు స్వతంత్రంగా చేసిన సర్వే రిపోర్టులా అనే విషయం మాత్రం పవన్ బయటపెట్టలేదు. జనసేనకు ఆదరణ పెరుగుతందని సర్వేలలో తేలిందని పవన్ చెప్పారు. గెలిచే అభ్యర్థులను మాత్రమే వచ్చే ఎన్నికల్లో నిలబెట్టబోతున్నామని పవన్ ప్రకటించారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని, తొలి సమీక్ష విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మొదలుపెతానని పవన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా బస్సు యాత్రను వాయిదా వేసుకున్నట్లు పవన్ ప్రకటించారు. గతంలో అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని పవన్ నిర్ణయం తీసుకకన్నారు. వచ్చే నెల దసరా నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. తిరుపతి నుంచి బస్సు యాత్రకు పవన్ శ్రీకారం చుట్టా్ల్సి ఉంది. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాలో పర్యటించేలా జనసేన వర్గాలు రూట్ మ్యాప్ సద్దం చేశాయి. ఈ మేరకు ఇప్పటికే అన్ని హంగులతో బస్సును కూడా సిద్దం చేశాయి. ఇటీవల పవన్ బస్సు యాత్రం కోసం జనసేన పార్టీ తయారుచేయించి ప్రత్యేక బస్సు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కానీ అనూహ్యంగా బస్సు యాత్రను పవన్ వాయిదా వేసుకున్నారు. సమస్యలపై అధ్యయనం జరుగుతందని, అధ్యయనం పూర్తయ్యాక బస్సు యాత్ర స్టార్ట్ చేస్తానని పవన్ తెలిపారు. జనవాణిలో వచ్చిన అర్జీలను కూడా అధ్యయనం చేస్తున్నామని, అలాగే కౌలు రైతు భరోసా యాత్ర కూడా కొన్ని జిల్లాల్లో చేయాల్సి ఉందని పవన్ తెలిపారు. అవి పూర్తయిన తర్వాత బస్సు యాత్ర పవన్ ప్రారంభించే అవకావాలున్నాయి. జనవరిలో పవన్ బస్సు యాత్ర ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీ సన్నద్దపై కొన్ని సూచనలు వచ్చాయని, అవి అధ్యయనం చేసుకుని బస్సు యాత్ర చేపడతానని పవన్ స్పష్టం చేశారు.

తన దగ్గర అపరిమిత ధనం లేదని, కానీ ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉందని పవన్ చెప్పారు. 2019 ఓటమి తర్వాత తాను పార్టీ వదిలిపెట్టి పోతానని చాలామంది అనుకన్నారని, ఒక మార్పు కోసం తాను ప్రయత్నిస్తునన్నానని అన్నారు. అంబేద్కర్ తన హీరో అని, ఎన్టీఆర్ లాంటి మహానటుడితో పోటీ పడలేమని వ్యాఖ్యానించారు. వెనుకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాటిచ్చానని అన్నారు. వెంటనే అధికారం చేపట్టాలనేది తన ఆలోచన కాదని, రాష్ట్ర విభజన తర్వాత అన్నీఆలోచించే అప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చానన్నారు. పాలసీపరంగా నిర్ణయాలు ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదన్నారు. ఆనాడు అమరావతి రాజధానిగా ఒప్పుకొని ఇప్పుడు 3 రాజధానులు అంటారా అని జగన్ ను ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

AP Volunteers: వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే.. వైసీపీకి కొత్త శత్రువులు అవసరమే లేదుగా!

AP Volunteers: శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇంట్లోనే కూతరు రూపంలోనో.. చెల్లెలు రూపంలో మన చుట్టూనే తిరుగుతారని ఓ సినిమాలో రావు రమేష్ అంటాడు. అక్కడ హీరోయిన్ గురించి చెప్పాల్సి వచ్చింది...
- Advertisement -
- Advertisement -