Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను తాను విమర్శించబోనని అన్నారు. ఆయన ఇంతరవకు అధికారంలో లేరు కాబట్టి ఆయనను తాను విమర్శింనని ఉండవల్లి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ పై రెక్కీ నిర్వహించారనేది వివాదాస్పద అంశమని, దానిపై తాను స్పందించన్నారు. రెక్కీ అంశంపై తాను జడ్జిమెంట్ ఇవ్వలేనని తెలిపారు. కోర్టులో తీర్పులు ఆలస్యంగా వస్తున్నాయని, జడ్జిలను ఎక్కువ మందిని నియమిస్తే తీర్పులు త్వరగా వస్తాయని సూచించారు.

 

మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, ఏమవుతాదో చూడాలని ఉండవల్లి తెలిపారు. అమరావతి రాజధాని పెట్టినప్పుడు మొదట వ్యతిరేకించిన వ్యక్తిని తానేనని, అప్పుట్లో భ్రమరావతి అనే పుస్తకం కూడా రాసినట్లు తెలిపారు. రాష్ట్ర పరిస్థితిపై ప్రస్తుతం విభజన వ్యథ అనే పుస్తకం రాస్తున్నట్లు ఉండవల్లి వెల్లడించారు. చరిత్ర రికార్డు కావాలని తాను రాస్తున్నట్లు చెప్పారు.

 

చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించినప్పుడు జగన్ మద్దతు తెలిపారని, అప్పుడే జగన్ వ్యతిరేకించి ఉంటే రైతులు భూములు ఇచ్చి ఉండేవారు కాదని ఉండవల్లి తెలిపారు. అప్పుడు అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ చెప్పడం వల్ల రైతులు భూములు ఇచ్చారని, ఇప్పుడు జగన్ తీరు వల్ల భూములు ఇచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి అయ్యే పరిస్థితి లేదని ఉండవల్లి తెలిపారు.

 

కాగా పవన్ ను విమర్శించనంటూ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కు ఉండవల్లి మద్దతు ఇస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో కూడా పవన్ కు మద్దతుగా ఉండవల్లి మాట్లాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -