Pawan Kalyan: ఎఫైర్లకు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా పవన్ కళ్యాణ్ హీరోయిన్!!

Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె ‘కహోనా ప్యార్ హే’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరంగేట్రం చేసింది. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం ఆమె వయస్సు 47 ఏళ్ళ ఉన్నప్పటికీ ఆమె ఇప్పటికి సింగిల్‌గానే ఉంటున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మందితో బ్రేక్ అప్ చేసుకుంది ఈ భామ. ఈ అమ్మాడు సినిమాలతో కన్నా అఫైర్స్, గొడవలతోనే ఎక్కువుగా వార్తలో నిలిచింది.

అమీషా పటేల్ కెరీర్ తొలినాళ్లలో ఆలియా భట్ తండ్రి మహేష్ భట్‌తో ఆమె ఐదేళ్ల పాటు సహ‌జీవనం చేశారు. ఇక అప్పట్లో వీరిద్దరిపై మీడియా అనేక వార్తలను ప్రచూరించినప్పటికీ ఇరువురు ఆ వార్తలపై స్పందించలేదు. కాగా.. పటేల్ – భట్ ఫ్యామిలీలో వీరి బంధం ఒక అలజడి సృష్టించింది అనే చెప్పాలి మరి. అయితే అమీషాతో బ్రేకప్ చేసుకున్న తర్వాత ఒక మీడియా సంస్థతో మహేష్ భట్ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. వారిద్దరూ విడిపోయామంటూ క్లారిటీ ఇచ్చారు. బ్రేక్ అప్ తరువాత ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా.. అమీషా లండన్ వ్యాపారవేత్త కనవ్ పూరి అనే వ్యక్తితో 2008లో కెమెరాకు చిక్కి వార్తల్లో నిలిచింది. అదే సమయంలో ఆమె టాలీవుడ్ ప్రముఖ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనూ, అటు హృతిక్ రోష‌న్‌తోనూ కూడా ప్రేమ‌లో పడినట్లు పుకార్లు వినిపించడంతో మరోసారి వార్తలో నిలిచారు. ఇక ఎప్పటిలాగే మీడియా ముందు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అమీషా తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పుకొచ్చింది. ఆమె కనవ్ పూరితో ప్రేమలో ఉన్నానని, గత ఆరు నెలలుగా డేట్ చేస్తున్నాని వెల్లడించింది. అనివార్య కారణాలతో వీరిద్దరి బ్రేకప్ చేసుకుంది. అనంతరం అమీషా తన కుటుంబంతో కలిసిపోయింది. ఆమె చాలా మందితో డేటింగ్ చేస్తూ కొన్నాళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉంటూ.. తర్వాత ప్రేమకు గుడ్ బై చెప్పడం అలవాటుగా మారింది. దీంతో ఇప్పటికి ఆమె సింగిల్‌గానే ఉండిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -