Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అధికారికంగా పవన్ కు ఈవీఎంపై పవన్ కళ్యాణ్ కు ఏ స్థానం కేటాయించారో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జనసేన పిఠాపురం అభ్యర్థి: కొణిదెల పవన్ కళ్యాణ్… ఈవీఎం బ్యాలెట్ నెంబర్ :04 అంటూ ఆ ప్రకటనలో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియటంతో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. మొత్తం 35 మంది అభ్యర్థులు పిఠాపురం నుంచి బరిలో నిలబడుతున్నారు. వీరిలో ఇద్దరు కీలక పార్టీలకు చెందిన వారు.ఒకరు వంగా గీత వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా రెండు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. మిగిలిన 33 మంది స్వతంత్ర అభ్యర్థులు.

ముందు రిజిస్టర్డ్ పార్టీ కాకపోవటంతో ఆయన గుర్తు కోసం కొంత సస్పెన్స్ లో పడ్డారు. చివరికి గాజు గ్లాస్ గుర్తు దక్కింది ఆపై నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. తాజాగా నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల అధికారులు జాబితా ఇచ్చారు డమ్మీ ఈవిఎం పై నాలుగో నెంబర్ బ్యాలెట్ ను పవన్ కి ఖరారు చేశారు.

కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతను పోటీలో నిలబెట్టిన వైసీపీ వీలైతే పవన్ కళ్యాణ్ ని ఓడించాలని, కుదరకపోతే కనీసం మెజార్టీని అయినా పరిమితం చేయాలని భావించింది. దీంతో పిఠాపురం పోరు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయింది. పిఠాపురంలో ఈసారి గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ కి మాత్రమే కేటాయించడంతో మరే ఇబ్బంది లేకుండా నాలుగో స్థానంలో ఉన్న ఆయన పేరు ఎదురుగా ఉన్న బటన్ పైకి ఓటు వేస్తే సరిపోతుందని చెప్తున్నారు జనసైనికులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -