Pawan-NTR: టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఏం జరుగుతుందో?

Pawan-NTR: టాలీవుడ్‌లో ఈ ఏడాది మల్టీస్టారర్ ట్రెండ్ బాగా కనిపించింది. ‘ఆర్ఆర్ఆర్, బంగార్రాజు, ఆచార్య, భీమ్లానాయక్, ఎఫ్-2’ వంటి మల్టీస్టారర్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి.. ప్రేక్షకులను అలరించాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించిన ఈ మల్టీ హంగామాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. మల్టీస్టారర్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాలు బిగ్గెస్ట్ హిట్‌ అందుకున్నాయి. అయితే వచ్చే ఏడాది కూడా మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలు విడుదల కానున్నాయి. దాదాపు 22 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి స్క్రీన్ చేసుకోనున్నారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించనున్నారు. కాగా, వీరిద్దరూ 2000లో ‘అన్నయ్య’ సినిమాలో నటించారు.

 

అలాగే విక్టరీ వెంకటేశ్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ముగ్గురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ముగ్గురూ కలిసి ఓ హిందీ చిత్రం ‘కిసీ కీ భాయ్ కీసీ కీ జాన్’ అనే సినిమా నటించనున్నారు. అయితే సల్మాన్ ఖాన్, వెంకటేశ్ ఇద్దరూ లీడ్ రోల్‌లో అలరించనుండగా.. రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నాడు. ఫల్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. అలాగే మరోవైపు తండ్రీకూతురు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో ‘అగ్నినక్షత్రం’ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో విశ్వంత్, చిత్రా శుక్లా, యలయాళ నటుడు సిద్ధిఖ్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

 

తాజాగా టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ను సిద్ధం చేశారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని, అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పాత్రలో నటించనున్నట్లు భోగట్టా. ఈ సినిమా స్టోరీని పవన్ కళ్యాణ్, తారక్‌కు ఆ స్టార్ డైరెక్టర్ చెప్పినట్లు సమాచారం. వీరిద్దరూ ఓకే చెబితే ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో ఒకటి అవుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -