PawanKalyan: పవన్ కళ్యాణ్‌కు ఆ నిర్మాత రూ.200 కోట్ల ఆఫర్ ఇచ్చాడా?

PawanKalyan: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజే వేరు. ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేయబోతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదలై.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

 

 

మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా చిత్రబృందం టైటిల్‌ను ఛేంజ్ చేసింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా టైటిల్ ఛేంజ్ చేస్తూ.. చిత్రబృందం కొత్త పోస్టర్ విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

 

 

ఈ సినిమాలతోపాటు పవన్ కళ్యాణ్ పలు కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా.. ప్రొడ్యూసర్లకు మేలు జరుగుతుందని భావిస్తుంటారు. సినిమా నార్మల్‌గా ఉన్నా కలెక్షన్లు రాబట్టడం కన్‌ఫర్మ్. అందుకే చాలా మంది నిర్మాతలు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్‌తో మూడు సినిమా చేయడానికి రూ.200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆఫర్‌కు పవన్ కళ్యాణ్ ఓకే చెప్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Narsapuram MP Candidate: ర‌ఘురామ‌కు న‌ర‌సాపురం టికెట్టే.. చంద్రబాబు పట్టుబట్టడంతో పొలిటికల్ లెక్కలు మారతాయా?

Narsapuram MP Candidate: వైసీపీ రెబెల్ ఎంపీగా పేరు సంపాదించుకున్నటువంటి రఘురామకృష్ణం రాజుకు ప్రస్తుతం ఏ పార్టీ నుంచి కూడా టికెట్ లేకపోవడంతో ఈయన పరిస్థితి కాస్త అయోమయంలో ఉంది కానీ ఈయన...
- Advertisement -
- Advertisement -