Pawankalyan: పవన్ కళ్యాణ్ ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందేనా?

Pawankalyan: తెలుగు రాష్ట్రాల్లో సినీ హీరోగా సుపరిచితులైన పవన్ కల్యాణ్.. జనసేన పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాలు కూడా చేస్తుండటం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏపీలో అధికార వైయస్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఇబ్బందికర పరిస్థితులను సృష్టించారు. విశాఖలో అధికార పార్టీ విశాఖ గర్జన పేరుతో సభను నిర్వహించాలని అనుకోగా.. అదే రోజు జనవాణి పేరుతో పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమవడానికి ప్రయత్నించడం జరిగింది.

 

అటు వైసీపీ విశాఖ గర్జన, ఇటు జనసేన జనసేన కార్యక్రమాలతో విశాఖలో ఉద్రిక్తతలు తలెత్తాయి. హోటల్ నోవాలెట్ లోని పవన్ కళ్యాణ్ ను వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం.. నాటకీయ పరిస్థితుల్లో పవన్ అక్కడి నుండి నిష్క్రమించడం అందరికీ తెలిసిందే. అయితే విశాఖలో జరిగిన ఈ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాణానికి ముప్పు ఏర్పడిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

విశాఖ నుండి తిరిగి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇల్లు, ఆఫీస్ లను కొందరు వ్యక్తులు ఫాలో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నారని.. అనుమానాస్పదంగా తల్లాచుడుతున్నారని పొలిటికల్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు.

 

కొందరు వ్యక్తులు కారులో పవన్ ప్రయాణిస్తున్న వాహనాలను ఫాలో చేశారని, వారు అన్ని వాహనాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. మరోసారి టూవీలర్ మీద ఫాలో చేశారని, ఆఫీస్ వద్ద కొందరు కావాలని గొడవకు దిగారని నాదెండ్ల తెలిపారు. కాగా ఈ విషయం మీద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల గురించి తెలంగాణ జనసేన ఇంఛార్జ్ శంకర్ గౌడ్.. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -