PawanKalyan: కొంప ముంచిన షో ఆఫ్.. పవన్ పరువు పోయిందిగా?

PawanKalyan: ఏపీ రాజకీయ అలజడికి కారణమైన ఇప్పటం చుట్టూ ఇంకా రాజకీయం నడుస్తూనే ఉంది. తాజాగా ఇప్పటం గ్రామాన్ని సందర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదైంది. మంగళగిరి నుండి ఇప్పటం గ్రామానికి కారు టాప్ మీద వెళ్లిన కారణంగా పవన్ మీద, ఆయన కారు డ్రైవర్ మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఇప్పటం గ్రామంలో జనసేన సభను నిర్వహించగా.. ఆ సభ కోసం భూములు ఇచ్చిన వారి ఇళ్లు, ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం కావాలని కూల్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన, టీడీపీ సానుభూతిపరుల ఇళ్లను టార్గెట్ చేసుకొని సదరు వ్యక్తుల ఇళ్లు, ఇంటి నిర్మాణాలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేసినట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

అయితే ఇప్పటం గ్రామంలో ఇల్లు, ఇళ్ల నిర్మాణాలు కూల్చివేతకు గురైన వారికి  భరోసా కల్పించడానికి ఇప్పటం గ్రామాన్ని పవన్ సందర్శించడం తెలిసిందే. అయితే మంగళగిరి నుండి ఇప్పటం గ్రామానికి నేషనల్ హైవే మీదుగా తన కారు టాప్ పై కూర్చొని వెళ్లడం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు పవన్, ఆయన డ్రైవర్ మీద IPC 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదైంది.

మంగళగిరి నుండి ఇప్పటం గ్రామానికి కారు టాప్ మీద కూర్చొని రావడం, కార్ ర్యాష్ డ్రైవింగ్ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నేషనల్ హైవీపై ఆయన వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించడంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి మారిస్‌ పేటకు చెందిన పి.శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇతరుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినందుకు ఐపీసీ 336 సెక్షన్ కింద.. అలాగే రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగా ఐపీసీ 279 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -