Payyavula Keshav: జగన్ పై రాయి వేస్తారని ఆ వ్యక్తికి ముందే ఎలా తెలుసు.. పయ్యావుల ప్రశ్నలకు జవాబుందా?

Payyavula Keshav: సీఎం జగన్ పై దాడి.. ఇదే విషయం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. సీఎం జగన్ పై జరిగినది చిన్న దాడి అయినప్పటికీ దానిని భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేస్తూ కావాలా రచ్చ రచ్చ చేస్తూ టిడిపి జనసేనపై లేని పోని నిందలు వేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే జగన్ పై దాడి జరిగిన విషయంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు స్పందించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ టిడిపి నేతలు కొన్ని రకాల ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలకు వైసీపీ నేతల దగ్గర సరైన సమాధానాలు లేవు.

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా వైసీపీ నేతలను ప్రశ్నించారు. కాగా తాజాగా ఆదివారం సాయంత్రం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొన్న కోడి కత్తి, నిన్న గొడ్డలి పోటు, నేడు గులకరాయితో దాడి ఇవన్నీ సీఎం జగన్‌ ముందస్తు కార్యాచరణలో భాగంగా జరిగినవేనని కేశవ్ ఆరోపించారు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటన జరుగుతుందని, అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మారుతుందని వైకాపా సామాజిక మాధ్యమ విభాగాన్ని నడిపించే వారిలో ప్రముఖ వ్యక్తి అయిన అవుతు శ్రీధర్‌రెడ్డి నాలుగు రోజుల క్రితమే సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారని చెప్పారు.

ఆ పోస్టును కేశవ్‌ విలేకరులకు చూపించారు. సరిగ్గా ఆయన చెప్పిన విధంగానే నాలుగో రోజు సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన అన్నారు. ఇది చూస్తే దాడి వారి ముందస్తు ప్రణాళికలో భాగమేనన్న విషయం స్పష్టం అవుతుందన్నారు. దీనిని సిగ్గు లేకుండా తెదేపాపై రుద్దడం సబబు కాదని ఆయన మండి పడ్డారు. దమ్ముంటే ఈ ఘటనపై సీబీఐ విచారణకు వైకాపా కోరాలని సవాల్‌ విసిరారు. మరి పయ్యావుల ప్రశ్నలకు వైసీపీ నేతలు దగ్గర జవాబు ఉందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -