Pensioners Party Chief Subbarayan: ఒక్కో విశ్రాంత ఉద్యోగికి జగన్ 2.5 లక్షలు ఇవ్వాలట.. పాలనలో ఇంత అన్యాయమా?

Pensioners Party Chief Subbarayan: గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఓటు వేయడానికి ముందు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన అభివృద్ధి జగన్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని బెరీజు చేసుకొని ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అంటూ అందరికీ డబ్బులు పంచుతున్నారే కానీ ఉద్యోగులకు పింఛని అందుకొని వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కనిపించడం లేదంటూ పించని దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు అలాగే పింఛన్ అందుకొనే రిటైర్డ్ ఉద్యోగులకు సమయానికి జీతం పడేదని తెలిపారు. అలాంటి వ్యక్తిని కాదని గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నందుకు బాగా బుద్ధి వచ్చిందని ఈయన తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నెల కూడా తాము ఒకటో తేదీ పింఛన్ అందుకోలేదని తెలిపారు. కొన్నిసార్లు 18వ తేదీ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ఇలా ఆలస్యం కావడంతో వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మందులు తీసుకురావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళమని తెలిపారు.

ఇక ఇప్పటివరకు విశ్రాంతి ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేకపోయారని తెలిపారు. అయితే ఆ డబ్బును చూడకుండానే కళ్ళు మూస్తామేమోనని ఎంతోమంది వృద్దులు ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2019 నుంచి ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి జగన్ మోహన్ రెడ్డి 2.5 నుంచి మూడు లక్షల రూపాయల వరకు అప్పు ఉన్నారని తెలిపారు. మరి ఈ డబ్బును జగన్ ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందో తెలియదు కానీ ఈయన పాలనలో మాత్రం పించని అందుకునే విశ్రాంత ఉద్యోగులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -