YSR: వైఎస్ ఫోటో పెట్టుకున్నవాళ్లు శత్రువులా.. జగన్ తో స్నేహమెందుకు కేసీఆర్!

YSR: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఆయనపై గెలుపొందిన కాంగ్రెస్‌ నాయకుడు బీరం హర్షవర్ధన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అప్పటి నుంచి జూపల్లి బీఆర్‌ఎస్‌కు క్రమంగా దూరమవుతూ వచ్చారు. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు కలిసి వ్యవహరించలేకపోవడంతో మొదలైన వైరం చివరకు జూపల్లి సస్పెన్షన్‌కు దారితీసింది.

కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జల్లాలో ఆది నుంచీ సంచలన రాజకీయాలకు పేరుగాంచారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే అప్పట్లో విద్యుత్‌ సమస్యలపై తీవ్ర స్థాయిలో ఉద్యమించి, జైలుకు సైతం వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కు సన్నిహితంగా మెలిగేవారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటూ, అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ అనుచరవర్గాన్ని ఏర్పర్చుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీతో జూపల్లి కృష్ణారావుకు మంచి బంధం ముడిపడి ఉంది. వైఎస్ఆర్ హాయంలో మంత్రిగా చేశారు కాబట్టి ఆయన మీద అభిమానంతో వైఎస్సార్ ఫొటో త‌న ఇంట్లో పెట్టుకున్నారు. అయితే దీనిపైనా రాద్ధాంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉందన్న జూపల్లి, పంజ‌రం నుంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ట్టుంద‌ని తెలిపారు.

వైఎస్సార్ ఫొటో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంద‌ని జూప‌ల్లి అంగీక‌రించారు. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ ఫొటో కూడా ఉంద‌న్నారు. త‌న ఇంట్లో ఎవ‌రి ఫొటో ఉండాలో , ఉండ‌కూడ‌దో చెప్పేవారా మీరా అని ఆయ‌న నిల‌దీశారు. వైఎస్సార్ ఫొటో త‌న ఇంట్లో వుంటే త‌ప్పేంట‌ని జూప‌ల్లి ప్ర‌శ్నించారు.

వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నందుకు అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ, మరి జగన్ తో అన్ని విధాలుగా ఎందుకు దోస్తీ కడుతుందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కక్షపూరింతంగానే పార్టీలో అవమానాలు చేసి బయటకు పంపారని, కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతా అని స్పష్టం చేశారు జూపల్లి.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -