Perni Nani: పవన్ కు చుక్కలు చూపించిన పేర్ని నాని.. పవన్ ను కుళ్లబొడుస్తూ?

Perni Nani: తెలిసిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూన్ 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన పేర్ని నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబు సలహా మేర‌కే ప‌వ‌న్ యాత్ర మొద‌లు పెడుతున్నార‌ని, లోకేశ్‌కు ఇబ్బంది లేకుండా తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో యాత్ర చేయాల‌ని బాబు సూచ‌న మేరకే, ప‌త్తిపాడు నుంచి స్టార్ట్ చేస్తున్నార‌ని వ్యంగ్యంగా మాట్లాడారు నాని. అలాగే షూటింగ్‌లు లేకపోవడం వల్లే పవన్ వారాహి యాత్ర చేపట్టారని పేర్ని నాని తెలిపారు.

అన్న‌వ‌రం టు భీమ‌వ‌రం టూర్ ప్యాకేజీనా అని పేర్ని నాని ప్ర‌శ్నించారు. ద‌స‌రా, సంక్రాంతి, ఉగాది, శ్రీ‌రామ న‌వ‌మి అయిపోయాయ‌ని ఇక అన్న‌వ‌రం, భీమ‌వ‌రం వ‌చ్చాయా? అని న‌వ్వుతూ ప‌వ‌న్‌ను పవన్ పై విమర్శలు గుర్తించారు. పోనీలేండి, ఆయ‌న తిప్పలేవో ప‌డ‌నీయండి ఎవ‌రో ఒక‌రి కోసం అని ప‌వ‌న్‌ పై సానుభూతి చూపారు. అన్న‌వ‌రమో, భీమ‌వ‌ర‌మో, చంద్ర‌వ‌ర‌మో అని వెటకారిస్తూ మాట్లాడారు. అన్న‌వ‌రం, భీమ‌వ‌రం బ‌దులు చంద్ర‌వరం యాత్ర అని పెడితే బాగుంటుంది అంటూ కామెడీగా దెప్పి పొడిచారు. ఎప్పుడూ చూడ‌ని విధంగా యాత్ర చూపుతాన‌ని ప‌వ‌న్ చెబుతున్నార‌ని, ఇలాంటివ‌న్నీ సినిమాకు క్లాప్ కొట్టే రోజు డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ చెబుతుంటార‌ని వ్యంగ్యంగా అన్నారు.

 

ఖ‌చ్చితంగా ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుంద‌ని, తెలుగు చ‌రిత్ర‌లో ఇది రికార్డు సృష్టిస్తుంద‌ని, బ‌ద్ద‌లు కొడుతుంద‌ని, ఈ సినిమా అద్భుతంగా వుంటుంద‌ని అంటార‌ని చెప్పుకొచ్చారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆహా, ఓహో అని చెప్పిన‌ట్టే, రాజ‌కీయాల్లో కూడా సినిమా తంతు చూపుతున్నార‌ని ప‌వ‌న్‌ పై సెటైర్స్ విసిరారు. త‌న‌కు సీట్లు, ఓట్లు, ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వద్ద‌ని, జ‌గ‌న్ దిగిపోవాలి, చంద్ర‌బాబు గ‌ద్దె ఎక్కాల‌ని ప‌వ‌నే చెబుతున్నార‌ని, ఇక వారాహి యాత్ర‌తో జ‌నానికి చేరువ‌య్యేది ఏంట‌ని పేర్ని నాని నిల‌దీశారు. త‌నకు జ‌నం ఓట్లు వేయ‌ర‌ని ఆయ‌నే చెబుతున్న‌ప్పుడు ఇక ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే మాట ఉత్ప‌న్న‌మ‌య్యేది ఎక్క‌డ అని ఆయ‌న ప్ర‌శ్నించారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే ప‌వ‌న్ ఎజెండా అని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నా, లేకున్నా పొగ‌డ‌డ‌మే ప‌వ‌న్ ప‌ని అన్నారు. అలాంటి జ‌న‌సేన‌ను రాజ‌కీయ పార్టీ అంటామా? అని ఆయ‌న నిల‌దీశారు. పిఠాపుర‌మో, తెనాలో, తిరుప‌తి సీటో ఏదో ఒక‌టి ప‌డేయాల‌ని కోర‌డ‌మే జ‌న‌సేనాని తాప‌త్ర‌య‌మ‌ని పేర్ని నాని విమ‌ర్శించారు. ద‌స‌రా నుంచి వారాహి తిరుగుతున్న‌ద‌ని అనుకుంటున్నామ‌ని, తిర‌గ‌ట్లేదా? అని వ్యంగ్యంగా మీడియా ప్ర‌తినిధుల‌ను నాని ప్ర‌శ్నించారు. మొత్తానికి పేర్ని నాని పవన్ కళ్యాణ్ కి మాత్రం నవ్వుతూనే విమర్శలు గుప్పిస్తూ మండిపడ్డారు.

 

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -