Ghaziabad: ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు ‘ఛీ’ అంటున్నారు!

Ghaziabad: మనం బయట నడుచుకుంటే వెళ్తున్నప్పుడు మన కొద్ది దూరంలో ఎవరికైనా చిన్న ప్రమాదమో.. మరిదైనా జరిగితే మానవత్వంతో పరుగెత్తుకుంటూ వెళ్లి చూసి సపర్యలు చేస్తాం. ఇంకా పెద్దదైతే పలువురికి సమాచారమిచ్చి వారిని ఆస్పత్రికో.. ఇంటికో పంపిస్తాం. కానీ.. ఇక్కడ ఓ మహిళ పెంచుకుంటున్న కుక్క ఓ చిన్నారి పట్టి కరిచినా ఏ మాత్రం కనికరం లేకుండా కేవలం చూస్తు ఉండిపోయింది తప్ప.. తన కుక్కను బాలుడి నుంచి దూరం చేయలేదు.. కనీసం ఆ చిన్నారి ఏడుస్తున్నా తనకేమీ తెలియనట్టుగా వ్యవహరించిన తీరు. ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

నేటి కాలంలో మనుషులతో సమానంగా కుక్కలను, పశువులను ప్రేమిస్తున్నారు. కుక్కలను పెంచడం ఓ హోదా భావించి చాలా మంది భారీ మొత్తంలో డబ్బులు వెచ్చింది వివిధ రకాల కుక్కలను పెంచుతున్నారు. మనుషులతో సమానంగా దాన్ని బాగోగులు చూస్తున్నారు.అయితే వారి వారి ఇష్టాలపై ఉంటుంది. కానీ.. అవి ఇతరులను గాయపరిచేందుకు ప్రయత్నిస్తే దాన్ని ఆపాల్సిన బాధ్యత యజమానులది ఉంటుంది. కానీ.. ఈ మహిళ చూసిన పనికి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ కు చెందిన ఓ బాలుడు తన పాఠశాల వదిలాక ఇంటికి వచ్చాడు. తను ఉంటున్న పై అంతస్తుకు వెళ్లేందుకు అపార్ట్‌ మెంట్‌లోని లిఫ్ట్‌ ఎక్కాడు. అప్పటి వరకు ఆ లిఫ్ట్‌లో ఆ అప్పుడు ఆ బాలుడు ఒక్కడే ఉన్నాడు. కాసేపటికి ఇంకో అంతస్తులో లిఫ్ట్‌ ఆగింది. అప్పుడు ఓ మహిళ తను పెంచుకుంటున్న కుక్కతో లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. లోపలికి వచ్చిన కుక్కను చూసిన ఆ చిన్నారి భయంతో పక్కకు జరిగాడు.

దానికి భయపడి తన ఫ్లోర్‌ రాకున్నా దిగాలనే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఆ కుక్క చిన్నారి పిక్కను గట్టిగా కరిచింది. కుక్క కరుస్తుండగా ఆ మహిళ మాత్రం మౌనంగా ఉండిపోయింది. కుక్కకాటుగా విలవిల లాడుతున్న చిన్నారిని కనీసం ఆ మహిళ ఓదార్చే ప్రయత్నమైనా చేయలేదు. అంతలోనే మరోసారి ఆ కుక్క చిన్నారిని కరిసింది. ఆ నొప్పి సదరు బాలుడు రుద్దుకుంటూ నిలబడగా తన ఫ్లోర్‌ రాగానే ఆ మహిళ తన కుక్కతో పాటు తమకేమీ ఎరగనట్టుగా దిగిపోయింది.

కుక్క కాటుకు ఆ చిన్నారి విలవిల లాడుతున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వైరల్‌ అయింది. ఈ వీడియోను అశోక్‌ గుప్తా అనే వ్యక్తి ట్విటర్‌ యూజర్‌ ట్విట్‌ చేశాడు. ఆ పిల్లాడి బాధ మీకు కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -