Phonepe: ఫోన్‌పే యూజర్స్‌ కోసం ఆ సౌకర్యాన్ని తీసుకొచ్చింది!

Phonepe: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఫోన్‌ పే వాడుతున్నారు. ఎక్కువగా దాని ద్వారానే లావాదేవీలు జరుపుతుంటారు. దాని ద్వారా లావాదేవీలతో పాటు కరెంట్‌ బిల్లు, రీచార్జులు, ఇతరాత్ర బిల్లులు పే చేసుకోవచ్చు. తాజాగా ఫోన్‌పే దాని యూజర్స్‌కు కోసం మరిన్ని కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్‌ కార్డు ఉంటే చాలు సునాయసంగా యూపీఐ సర్వీసులు పొందవచ్చని తెలిపింది. ఫోన్ పే యూజర్స్‌ ఆధార్ కార్డు వివరాల ద్వారా ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. గతంలో కస్టమర్లు డెబిట్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉండేది. అలాగే యూపీఐ పిన్ సెట్ చేసుకునేటప్పుడు డెబిట్ కార్డు వివరాలు నమోదు చేయాల్సి రావడంతో చాలా మంది ఇబ్బంది పడే వారు. డెబిట్ కార్డు లేని వారు ఫోన్ పే సర్వీసులకు దూరంగా ఉండేవారు. ఇకపై ఆ సమస్యకు చెక్‌ పెట్టింది. డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు లేకుండానే ఆధార్ బేస్డ్ ఓటీపీ అథెంటికేషన్ ద్వారా యూపీఐ సర్వీసులు యాక్టివేట్ చేసుకోవచ్చు.

 

ఫోన్‌పే యూజర్లు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆధార్ కార్డులోని చివరి ఆరు నెంబర్ ఎంటర్ చేయాలి. అలా చేయగానే ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఈ పని పూర్తవ్వగానే ఫోన్ పే యాక్టివేట్‌ అవుతోంది. అంటే డెబిట్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు ఉపయోగిస్తే సరిపోతుంది. ఆధార్ బేస్డ్ యూపీఐ ఆన్‌బోర్డింగ్ సర్వీసులు తీసుకువచ్చిన తొలి యూపీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా ఫోన్ పే నిలిచింది. కొత్త సర్వీసులు తీసుకురావడంతో చాలా మంది ఇంకా ఫోన్ పే సేవలు మరింత సులభంగా పొందవచ్చు.

 

ఈ సందర్భంగా ఫోన్‌పే హెడ్ ఆఫ్ పేమెంట్స్ దీప్ అగర్వాల్ పలు విషయాలు వెల్లడించారు. ఆధార్ బేస్ట్ అథంటికేషన్ సర్వీసులు అందిస్తున్న తొలి ఫిన్‌టెక్ సంస్థ తమదే అన్నారు. యూపీఐ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఇప్పుడు మరింత సులభతం అయ్యిందని ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ, యూఐడీఏఐ తీసుకువచ్చిన ఈ సర్వీసులు చాలా ఉపయోగకరమైనవని వివరించారు. యూపీఐ అనేది గ్లోబల్ సక్సెస్ అని అభిప్రాయపడ్డారు. యూపీఐని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఎన్‌పీసీఐతో కలిసి పనిచేస్తున్నామని ఫోన్‌పే వేగంగా దూసుకుపోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -