Lemons: మొటిమలు, మచ్చలకు వీటితో చెక్‌ పెట్టవచ్చు!

Lemons: వేసవిలో వివిధ రకాల డ్రింక్స్‌ అందుబాటులో ఉన్నా కూడా చాలా మంది నిమ్మరసాన్నే తాగుతుంటారు. అది శరీరానికి చల్లదానంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. నిమ్మతో అనేక రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి. తాగేందుకు నిమ్మరసం, వంటకాల్లో వాడతారు. అంతేకాక నిమ్మకాయ పైన ఉండే తొక్కుతో కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. చర్మం, జుట్టు, పొట్ట తదితర వాటికి నిమ్మ మేలు చేస్తోంది. నిమ్మ తొక్కల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మ తొక్కలను ఎండ బెట్టి మెత్తని పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు మెండుగా ఉండటంతో దంతాలను శుభ్రం చేయడంతో పాటు నోటి సమస్యలకు చెక్‌ పెడుతాయి.

నిమ్మకాయ తొక్కల్లో పెక్టిన్‌ అనే పదార్థం ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తోంది. లివర్లో బైల్‌ యాసిడ్స్‌ బాగా విడుదలయ్యేలా చేస్తుంది. నిమ్మకాయ తొక్కలు అధిక బరువును తగ్గించడమే కాకుండా బీపీనను కూడా అదులోకి తీసుకొస్తాయి. అంతేకాక షుగర్‌ వ్యాధి, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ వంటి రోగాల ప్రమాదాలాను తగ్గించడానికి దీనిలో ఉండే డీలైమొనేన్‌ సహాయపడుతుంది. నిమ్మ తొక్కలను వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. గాల్‌ బ్లాడర్‌ రాళ్ల సమస్యను నివారించేందుకు నిమ్మ తొక్కలతో తయారు చేసిన పొడి ఉపయోగపడుతుంది.

నిమ్మ తొక్కల్లోని విటమిన్‌ –సీ తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగేలా చేస్తోంది. ఎండబెట్టిన నిమ్మ తొక్కలను గ్రీన్‌ టీ ఇంకా అలాగే హెర్బల్‌ టీ లో కలిపి తీసుకుంటే దంత సమస్యలు తగ్గుతాయి. ఒక చెంచా నిమ్మ పండు లో తగినన్ని పాలు కలిపి బాగా పేస్ట్‌లాగా చేసి ముఖానికి రాసుకుని కాసేటి తర్వాత కడుకుంటే ముఖం గ్లో వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. నిమ్మ తొక్కల్లో కొన్ని రకాల కేన్సర్లను తగ్గించే గుణాలుంటాయి. నిమ్మ తొక్క నోటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మకాయ తొక్కను ముఖానికి రాసుకోవడంతో చర్మ సమస్యలు, నల్లని మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -