Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ పార్టీ ఏమి సాధించింది అనేదానికన్నా ప్రత్యర్థులను విమర్శించటమే ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు. అందులో వంగా గీత ఒకరు. ఈమె పవన్ కళ్యాణ్ మీద భారీ సెటైర్లు వేస్తూ తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి జనసేనాని కంటే పవర్ స్టార్ పదమే పవర్ఫుల్. దానిని చూసే అభిమానులు ఆయన వెంట పడుతున్నారు. ఆ స్టార్ డం ని చూసే అభిమానులు ఆయనని దేవుడులా కొలుస్తారు అని పవన్ కళ్యాణ్ మీద భారీ సెటైర్లు వేస్తున్నారు. లక్ష ఓట్ల మెజారిటీ అన్న పవన్ కళ్యాణ్ మాట కి వంగా గీత ఇచ్చిన కౌంటర్ ఇది. లక్ష ఓట్ల మెజారిటీ వస్తే ఎందుకు అంత మందిని పిఠాపురం చుట్టూ తిప్పుతున్నారు అని సూటిగా ప్రశ్నించారు గీత.

జబర్దస్త్ టీం అంతా పిఠాపురం లోనే ఉంది, అలాగే ఎన్నారైలు కూడా పిఠాపురానికి క్యూ కడుతున్నారు ఎవరికి వారు పవన్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మేము రాకపోయినా లక్ష ఓట్లే అయినా మా అభిమానం కొద్దీ ప్రచారం చేస్తున్నామని జబర్దస్త్ కళాకారులు అంటున్నారు. పైగా ఎక్కడి నుంచో గుండాలు వస్తున్నారు అని అంటున్నారు, బయట వారు వస్తే ఖబడ్దార్ అని బెదిరిస్తున్నారు అంటూ గీత ఫైర్ అయ్యారు.

తాము ఎవరినీ విమర్శించడం లేదని, తమ ప్రచారం తాము చేసుకుంటున్నామని మేము ప్రజలకు ఏమి చేసామో చెప్పుకుంటున్నాము మాకు పాజిటివ్ వేవ్ ఉంది, మేము లక్ష ఓట్ల మెజారిటీ అని చెప్పలేదన్నారు గీత. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఎవరికి వారు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓటర్లు మాత్రం జరుగుతున్నది చూస్తూ సైలెంట్ గా ఉన్నారు. మరి ఎలాంటి తీర్పు ఇస్తారు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -