PKL 2022: జైపూర్ ధాటికి నిలబడలేక పోయిన బెంగళూరు!

PKL 2022: క్రికెట్ ని అందరికీ చేరువ చేయడంలో ఐపీఎల్ సహాయపడినట్టు,కబడ్డీ ఆటని ప్రోత్సహించడంలో ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) ఎంతో పెద్ద భూమిక పోషించింది. పెద్ద పెద్ద స్టార్లు జట్లకి ఓనర్లు గా ఉండటంతో ఈ ఆటకి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ మంచి రసవత్తరంగా సాగుతుంది. అభిమానులు కూడా ఆటని బాగా ఆస్వాదిస్తున్నారు.

లీగ్ మ్యాచ్ లు కొన్ని రోజుల్లో ముగియనున్నాయి. ఏ జట్లు సెమీస్ కి చెరుతాయో కూడా మనకి ఒక అవగాహన రానుంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్న జైపూర్ పింక్ పాంథర్స్ (Jaipur Pink Panthers) జట్టు టేబుల్ లో అగ్ర స్థానానికి చేరుకుంది. బెంగళూరు బుల్స్ (Bengaluru Bulls)పై సాధించిన అద్భుత విజయం జైపూర్ జట్టుని ప్రథమ స్థానంలో ఉంచింది.

రసవత్తరంగా సాగిన మ్యాచ్!

ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. మొదట్లో బెంగళూరు జట్టు దూకుడుగా ఆడినా కూడా జైపూర్ జట్టు కీలక సమయంలో పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. జైపూర్ జట్టుకి హీరో అంటే అర్జున్ దేశ్ వాల్ అనే చెప్పాలి. అతను తన జట్టుకి 13 పాయింట్లు అందించాడు.సమిష్టి కృషితో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు బెంగళూరు బుల్స్ ని మట్టి కరిపించింది. ఈ విజయంతో సెమీస్ కి వెళ్ళే అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది.

ఫేవరెట్స్ గా టోర్నీలో అడుగుపెటటిన జైపూర్ పింక్ పాంథర్స్ ఆడిన 19 మ్యాచ్ ల్లో 13 విజయాలు నమోదు చేసింది. మిగిలిన 6 మ్యాచ్ లలో పరాజయం పాలయ్యింది. ఈ గణాంకాలతో టేబుల్ లో మొదటి స్థానం లో ఉంది. పుణేరి పల్టాన్ టేబుల్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఇక తెలుగు టైటాన్స్ (Telugu Titans) విషయానికొస్తే నాకౌట్ దశకు వెళ్ళడం అసాధ్యం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -