Plant: ఆ మొక్కను నాటితే వాస్తు దోషాల నివారణతో పాటు ఆ రోగాలన్నీ దూరమవుతాయి!

Plant: హిందూ సాంప్రదయాల్లో వాస్తు, శాస్త్రాలను చాలా నమ్ముతారు. వాటి ప్రకారమే కొన్ని పనులు చేపట్టడం, ఇంటి నిర్మాణం, శుభకార్యాలను ప్రారంభిస్తారు. కొన్ని ఇళ్లలో కీడు జరిగితే అవి వాస్తులోపమే అంటూ దోష నివారణకు పూజలు హోమాలు చేస్తుంటారు. ఇంటిలో సుఖ సంతోషాలు ఉండాలని కొన్ని రకాల చెట్లను పెంచుకుంటుంటారు. పారిజాత చెట్టును నాటడంతో ఇంటి ప్రతికూల శక్తిని తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. అంతే కాకుండా ఇంట్లోని వారికి మానసిక ప్రశాంతతనిచ్చి, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షును సిద్ధిస్తుంది. దీనితో పాటు.ఈ చెట్టును నాటడం వల్ల ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలిగిపోతాయి.

పారిజాత ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. దీని ఆకులు ఆకులు,
పువ్వులు, బెరడుతో అనేక జ్వరాలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మలేరియా, డెంగ్యి, చికున్‌ గున్యా వంటి వ్యాధులకు కూడా చెక్‌ పెట్టవచ్చు. అంతేకాక ప్లేట్‌ లెట్లను పెంచుతాయి. దీంతో జ్వరాల నుంచి త్వరగా కోలుకుంటారు. పారిజాతం చెట్టుపై లక్ష్మీదేవి, నారాయణుడు ఉంటారని విశ్వసిస్తారు. అంతేకాక ఈ చెట్టు కూడా స్త్రీ అందమైన రూపంగా పరిగణించబడుతుంది. ఈ చెట్లు శరదృతువులో దుర్గాపూజకు ముందు పుష్పించడం ప్రారంభిస్తాయని నమ్ముతారు. దీనిని దీవి పక్షం అని పిలుస్తారు. అందువల్ల, ఈ చెట్టు, దాని పువ్వులతో పాటు, దుర్గా దేవి శక్తులు కూడా ఉన్నాయని నమ్ముతారు. దీంతో పాటు వీటి వ్వులు కూడా శివునికి సమర్పించబడతాయి.

పారిజాత చెట్టును శుక్రవారం లేదా సోమవారం మాత్రమే నాటాలి. ఈ రెండూ దేవతలను పూజించే దేవి పక్షం రోజులు. శుక్రవారం సాయంత్రం పారిజాత చెట్టును నాటడం ఉత్తమ సమయం, శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ దినాన్ని లక్ష్మి దినంగా పరిగణిస్తారు.ఈ చెట్టును ఉత్తర దిశలో చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది శాంతి, శ్రేయస్సుకు దిశగా పరిగణించబడుతుంది. ఈ చెట్టును ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యరశ్మి పడే దశలో ఉంచితే చాలా మంచిదట.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -