PM Modi: మోదీ గేమ్ ప్లాన్.. ఆ మూడు పార్టీలు బీజేపీకే సపోర్ట్

PM Modi: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. రాజకీయ అవసరాలను బట్టి బీజేపీ తమ వ్యూహలను మారుస్తూ ఉంటుంది. అవసరం ఉంటే దగ్గరకు చేర్చుకుంటుంది.. అవసరం లేదనుకుంటే నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తుంది. అవకాశావాద రాజకీయాలే ఆ పార్టీ ఎక్కువ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల పట్ల బీజేపీ వైఖరి చూస్తుంటే కర్ర విరగొద్దు.. పాము చావకూడదు అనే సామెతలా ఉంది. ఏ పార్టీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందో.. ఏ పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉంది. అధికారికంగా పొత్తులో ఉన్నా.. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ కలిసిందే లేదు. కలిసి కార్యక్రమాలు నిర్వహించిన దాఖరాలు అసలు లేవు. కలిసి ఎక్కడా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేయలేదు. పేరుకే పొత్తులో ఉన్నా.. జనసేన, బీజేపీ ఎక్కడా పొత్తులో ఉన్నట్లు అనిపించడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు పనిలేదని, మోదీ,అమిత్ షాలతో తాను టచ్ లో ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రకటించారు. అయితే మోదీ, అమిత్ షా అసలు పవన్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. కలవాలని ప్రయత్నాలు చేసినా.. పనవ్ కు మోదీ,అమిత్ షాలు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.

దీనిని బట్టి చేస్తే బీజేపీ, జనసేన మధ్య అసలు సంబంధాలు సరిగ్గా లేవని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. వైసీపీ, టీడీపీ పట్ల సానుకూలంగా ఉంది. వైసీపీ, జగన్ పట్ల బీజేపీ సానుకూల ధోరణీతో ఉంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం లేదు. ఇక జగన్ పట్ల కూడా మోదీ,అమిత్ షా సానుకూలంగా ఉంటున్నారు. ఇక టీడీపీ పట్ల కూడా బీజేపీ సానుకూలంగా ఉంది. ఇటీవల ఆజాదీ కి అమృతోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోదీ ఏకాంతంగా భేటీ అయ్యారు.

దాదాపు 5 నిమిషాల పాటు మోదీ, చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత కలిసి మాట్లాడుకోవడంతో ఏం మాట్లాడుకున్నారనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల సమయంలో మోదీపై చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. ఒంటికాలిపై మోదీ విమర్శలు చేశారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో బీజేపీని తిట్టిపోశారు. కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత చంద్రబాబు బీజేపీని అసలు ఒక్కమాట కూడా అనడం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే మద్దతు ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే బీజేపీకి మోదీ మళ్లీ దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ కూడా టీడీపీని దగ్గర చేసుకుంటున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి చేస్తే అర్థమవుతుంది. ఇక చంద్రబాబుతో మోదీ భేటీ జరిగిన మరుసటి రోజే నీతి అయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత జగన్ తో పాటు మరో ముగ్గురు సీఎంలతో మోదీ భోజనం చేశారు. ఈ సందర్భంగా దాదాపు గంట పాటు జగన్ తో మోదీ మాట్లాడారు. దీంతో ఏమి మాట్లాడుకున్నారనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో భేటీ తర్వాత రోజే జగన్ తో మోదీ గంటసేపు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

ఒకవైపు చంద్రబాబు.. మరోవైపు జగన్ తో మోదీ మాట్లాడటం, ఇక జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్న క్రమంలో మూడు పార్టీల పట్ల బీజేపీ సానుూలంగా ఉన్నట్లు అర్థమవుతుంది. దీంతో ఈ మూడు పార్టీలు డైలమాలో పడ్డాయి.అసలు మోదీ ఎవరి పట్ల సానుకూలంగా ఉన్నారనేది ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -