Chandrababu Naidu: ఏపీ పాలిటిక్స్ లో ఊహించని మార్పులు.. బాబుకు మోదీ-అమిత్ షా సపోర్ట్?

Chandrababu Naidu: ఏపీ రాజకీయం మలుపులు తిరుగుతోంది. రాజకీయం రంగులు మారుతోంది. అనూహ్య పరిణామాలు ఏపీ పాలిటిక్స్ లో చోటుచేసుకుంటున్నాయి. ఊహించని ట్విస్ట్ లతో రాజకీయం రంజుగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు జరిగేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఎవరితో కలుస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? పొత్తులు పొడుస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో ఏపీలో పాలిటిక్స్ లో ట్విస్ట్ లో చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు వైసీపీకి సపోర్ట్ గా కనిపించిన బీజేపీ.. క్రమక్రమంగా రంగులు మారుస్తుంది. చంద్రబాబును దగ్గర చేసుకునేందుకు క్రమక్రమంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కుప్పం అల్లర్లు ఏపిసోడ్ దానికి బలం చేకూరుస్తుంది. కుప్పంలో చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగిందో.. లేదో.. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబుకు భారీగా భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 6+6గా ఉన్న ఎన్ఎస్ సీ కమెండోల భద్రతను 12+12కి భారీగా పెంచింది. ఢిల్లీ నుంచి ఏకంగా ఎన్ఎస్జీ టీమ్ ఏపీకి వచ్చింది.

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంలో తనిఖీలు చేసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలోని ప్రతి గదిని చెక్ చేశారు. చంద్రబాబు ఛాంబర్ లోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లి భద్రతపై ఆరా తీశారు. ఆఘమేఘాల మీద కేంద్రం స్పందించడం బట్టి చూస్తుంటే.. చంద్రబాబుకు కేంద్రం అండగా నిలుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా బాబుకు బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇస్తుందనే టాక్ నడుస్తోంది. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాబును మోదీ-అమిత్ షా దగ్గరకు తీసుకున్నట్లు తాజాగా జరిగిన పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది.

ఢిల్లీలో 5 నిమిషాల పాటు మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం, ఇటీవల తెలంగాణలో పర్యటనలో ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం, అంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావుతో 45 నిమిషాల పాటు సమావేశం కావడం చూస్తుంటే చంద్రబాబును బీజేపీ దగ్గర చేసుకుంటుందనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. జగన్ కు ఎదుర్కొవాలంటే కేంద్రంలోని బీజేపీ మద్దతు తప్పనిసరి అని భావించిన బాబు.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి వ్యూహలు రచిస్తున్నారు.

టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందనే ప్రచారం జోరుగా జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు మోదీ, అమిత్ షా, బీజేపీలపై చెలరేగిపోయిన చంద్రబాబు.. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చూసిన తర్వాత సైలెంట్ అయ్యారు. ప్రతి అంశంలోనూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీని ఒక్కమాట కూడా అనడం లేదు. మోదీ, అమిత్ షాలకు దగ్గర అయ్యేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో బీజేపీకి దగ్గర అయ్యేందుకు మరింత స్పీడ్ పెంచారు.

బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు రామోజీరావుతో చంద్రబాబు రాయబారం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే రామోజీరావును అమిత్ షా కలిశారని చెబుతున్నారు. అమిత్ షా-రామోజీరావు భేటీలో టీడీపీ-బీజేపీ పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు టాక్ నడుస్తోంది. రామోజీరావు మధ్యవర్తిత్వం ద్వారా బీజేపీతో పొత్తుకు టీడీపీ సై అంటోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -