Ghulam Nabi Azad: ఆజాద్ కొత్త పార్టీ వెనుక బీజేపీ సరికొత్త స్కెచ్.. భారీగా ఫండింగ్

Ghulam Nabi Azad: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, మాజీ ఎంపీ, దేశ రాజకీయాల్లోనే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి నేత ఊహించిన విధంగా రాజీనామా చేయడం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ కు గురి చేసింది. రాజీనామా చేస్తూ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై ఆయన చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతోన్నాయి.

అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన.. తన తర్వాతి స్టెప్ ఏంటనేది ఎవరికీ తెలియడం లేదు. రాజీనామా అనంతరం జాతీయ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలో తన సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్ లో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరనని, బీజేపీలో చేసే ఆలోచన లేదన్నారు. రాజకీయాల్లోనే కొనసాగుతానన్నారు.

ఈ క్రమంలో గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ వెనుక బీజేపీ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కొత్త పార్టీకి బీజేపీ ఫండింగ్ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. గతంలో గులాంనబీ ఆజాద్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేవారు. ఆ రాష్ట్రంలో ఆయనకు మంచి ప్రాబల్యం ఉంది. దీంతో ఆయన సేవలను జమ్మూకశ్మీర్ ఉపయోగించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. జమ్మూకశ్మీర్ లో బీజేపీకి అంత బలం లేదు. అక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ కనుక బీజేపీకి ఛాన్స్ లేదు. అందుకే గులాం నబీతో పార్టీ పెట్టించి లబ్ధి పొందాలని కమలం పార్టీ చేస్తోంది. నబీని ముందు పెట్టి వెనుక నుంచి కథ నడపాలని కమలదళం భావిస్తోంది.

గతంలో 2014 తర్వాత మెహబూబా ముఫ్తీ పీడీఎప్ పార్టీతో కలిసి బీజేపీ అధికారంలోకివచ్చింది. ఆ తర్వాత విబేధాల వల్ల మెహబూబా ముఫ్తీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆర్టికల్ 360 రద్దు తర్వాత అక్కడ జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ పరాజయం పాలైంది. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీ ఓడించాయి. దీంతో ముస్లిం ఓటర్లు ఉన్న జమ్మూకశ్మీర్ లో ఒంటరిగా బరిలోకి దిగితే బీజేపీకి అవకాశాల్లేవు.

అందుకే గులాం నబీ ఆజాద్ ని అస్త్రంగా ఉపయోగించాలని జమ్మూకశ్మీర్ లో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. గులాంనబీ ఆజాద్, మోదీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గులాం నబీ ఆజాద్ కు పద్మభూషణ్ తో కేంద్రం సత్కరించింది. గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవి ముగిసిన తర్వాత వీడ్కోలు సభలో మోదీ భావేద్వేగానికి గురయ్యారు. ఆజాద్ సేవలను కొనియాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దీనిని బట్టి చూస్తుంటే మోదీ, గులాం నబీ ఆజాద్ మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయో అర్ధమవుతుంది. దీంతో ఆయనను తురుపుముక్కగా ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో కశ్మీర్ లో బలపడాలని మోదీ చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -