PM Narendra Modi: నరేంద్ర మోదీ భోజనంలో ఇవి తప్పక ఉండాలట!

PM Narendra Modi: అనునిత్యం నిత్యం ఉల్లాసం, ఉత్సాహం గా ఉండే మోదీ ఆరోగ్యంగా ఉండేందుకు ఆయన తీసుకునే ఆహార పదార్థాలు ఎంటోనని చాలా మంది ఆలోచిస్తుంటారు. మోదీ ఏ పని చేయాలన్నా మొదట ఆరోగ్యంగా ఉండాలన్నది ఆయన విశ్వాసం. అందుకే ఆయన ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇక్కడ చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ప్రధాని నిద్రపోయే సమయం . సాధారణంగా ఒక మనిషి కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే మోదీ మాత్రం రోజూ 3.5 గంటలకు మించి నిద్రపోనని ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే ఆహారంలోనూ ఎంతో మితంగా ఉంటారని వెల్లడించారు.

ఉదయం 5 గంటలకు నిద్రలేచే ప్రధాని 30-45 నిమిషాల పాటు యోగా చేస్తారు. ఆ తర్వాత మెడిటేషన్, వాకింగ్‌ మార్నింగ్ వర్కౌట్స్ చేస్తారు. ఇక పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేస్తారని వెల్లడించారు. ఆహార విషయానికి వస్తే ప్రధాని మెనూలో పసుపుతో కూడిన పదార్థాలు తప్పకుండా ఉండాలట. అలాగే పెరుగు కూడా డైట్‌లో ఉండాల్సిందే.

హిమాచల్‌లో పెరిగే పర్వత పుట్టగొడుగులను తినేందుకు ప్రధాని బాగా ఇష్టపడతారట. మోరెల్ మష్రూమ్ అని పిలిచే వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పలు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ -డీ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ పుట్టగొడుగులు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. రోగనిరోధక శక్తిని పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని రక్షిస్తాయని ప్రధాని వెల్లడించారు. దేశ ప్రధాని మోదీ ఈరోజు (శనివారం)తో 72వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇతర దేశాల అధ్యక్షులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -