Pradhan Mantri Vaya Vandana Yojana: PMVVY పాలసీ తీసుకుంటే నెలకు 9000 రూపాయలను పింఛను పొందవచ్చు!

Pradhan Mantri Vaya Vandana Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వయ వందన యోజన అనే పించను పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్లు నిండి ఆదాయం కోల్పోయే వారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఆదాయం కోల్పోయే వారికి ఇది చాలా అండగా నిలబడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ పాలసీ వెలుగులోకి వచ్చింది. మరి ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీను 2017 మే 4న ప్రారంభించింది. అప్పటినుంచి ఈ పథకంలో చేరడానికి ప్రతి సంవత్సరం గడువు పెంచుకుంటూ వస్తుంది. ఇక చివరికి 2023 మార్చి 31న దీని చివరి గడువు ను ఫిక్స్ చేశారు. ఈ పాలసీను ఏరకంగా అయినా కొనుగోలు చేయవచ్చు. అంటే ఆన్లైన్ ద్వారా అయినా.. అఫ్ లైన్ లో అయిన కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా 15 లక్షలు చెల్లించి ఈ పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక కొనుగోలు చేసిన తర్వాత నెల నుంచి పించను పొందడం స్టార్ట్ అవుతుంది.

ఈ పాలసీలో చేరడానికి కావాల్సిన అర్హతలు కనీసం వయసు 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉన్న పర్వాలేదు. పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు ఉంటుంది. నెలకు పింఛను 10000 రూపాయలు పొందవచ్చు. ఇక గరిష్ట పింఛను 9250రూపాయలు. ఇక పింఛను చెల్లింపు విధానం సంవత్సరంలో మీకు నచ్చిన కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకు పింఛను మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు మూడు నెలలకోసారి పింఛను కావాలి అనుకుంటే కనిష్టంగా నెలకి ₹3,000 చొప్పున నెలకు 27,750 పొందవచ్చు.

ఇక కాలవ్యవిధ ముగిసిన తర్వాత పింఛను పొందే వారికి పాలసీ కొనుగోలు సొమ్మును పూర్తిగా ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీ టైంలో మరణిస్తే పాలసీ కొనుగోలు వారి నామినీకి పూర్తిగా చెల్లించేస్తారు. ఈ విధంగా అప్పటికే వాళ్లు క్రమం తప్పకుండా పింఛను పొంది ఉంటారు. ఇక అంతే కాకుండా మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత పింఛనుదారుడు రుణం పొందే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -