POCO: మార్కెట్లోకి పోకో సి55.. ధర ఫీచర్స్ ఇవే?

POCO: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. పోకో పోకో సీ55 స్మార్ట్‌ఫోన్‌ ని రిలీజ్ చేసింది. మరి ఈ ఫోన్ ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పోకో సీ55 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది.

4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499 కాగా, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. తాజాగా ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌ కార్ట్‌లో సేల్ ప్రారంభం అయ్యాయి. ఈ ఫోన్ మనకు ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. తొలిరోజు పోకో సీ55 కొనేవారికి 4జీబీ 64జీబీ వేరియంట్‌పై రూ.500 తగ్గింపు ప్రకటించింది. దీంతో పాటు మరో రూ.500 బ్యాంక్ ఆఫర్‌తో డిస్కౌంట్ పొందొచ్చు. 6జీబీ128జీబీ వేరియంట్‌పై రూ.1000 బ్యాంక్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్స్‌తో 4జీబీ 64జీబీ వేరియంట్‌ను రూ.8,499 ధరకు, 6జీబీ 128జీబీ వేరియంట్‌ను రూ.9,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

 

పోకో సీ55 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.71 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇన్పీనిక్స్ నోట్ 12ఐ, మోటో జీ31, టెక్నో స్పార్క్ 9 ప్రో, రియల్‌మీ నార్జో 50ఏ లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. పోకో సీ55 స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. పోకో సీ సిరీస్‌లో తొలిసారి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -