TDP MLA Arrest: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే?

TDP MLA Arrest: ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కొండెపి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ‌నేయ స్వామిని పోలీసులు అత్యంత అమానుష రీతిలో అరెస్టు చేశారు. బలవంతంగా పోలీసులు ఆయనని అరెస్టు చేయడమే కాకుండా తన చొక్కా మొత్తం చింపేసి తనని అరెస్టు చేయడంతో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టారు.కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడి చేయడానికి వైసీపీ ఇన్‌చార్జి వ‌రికూటి అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడనిఅశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో చలో తూర్పు నాయుడుపాలెం అంటూ.. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి అశోక్ బాబు పిలుపునిచ్చారు.

 

వైసీపీ పార్టీకి కౌంటర్ ఇస్తూ చలో గుంటూరు కార్యక్రమానికి టిడిపి పిలుపునిచ్చారు. టిడిపి శ్రేణులు ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకు చేరుకొని భారీ ర్యాలీగా టంగుటూరుకు బయలుదేరారు. అయితే పోలీసులు టిడిపి శ్రేణులను అడ్డుకున్నారు. ఇలా టంగుటూరికి వెళ్లాలని టిడిపి శ్రేణులు పట్టు పట్టడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు అయినప్పటికీ వీరి ప్రయత్నం ఆగకుండా ముందుకు సాగడంతో చివరికి పోలీసులు టిడిపి శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.

 

ఈ క్రమంలోనే ఈ తోపులాటలో భాగంగా టిడిపి ఎమ్మెల్యే స్వామి చొక్కా చినిగిపోయినప్పటికీ పోలీసులు మాత్రం తనని బలవంతంగా జీపులో ఎక్కించి అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మ‌రోవైపు.. జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -