Ponniyin Selvan Movie Review: పొన్నియిన్ సెల్వన్ సినిమా రివ్యూ & రేటింగ్

నటీనటులు: చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్ ప్రభు, నాజర్ తదితరులు.
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్
నిర్మాత: మని రత్నం, సుభాస్ కరణ్ అల్లి రాజా, సుహాసిని మణిరత్నం.
దర్శకత్వం: మని రత్నం
సంగీతం: A.R. రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రిలీజ్ డేట్: 30 సెప్టెంబర్

Ponniyin Selvan Movie Review and Rating 

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం పోన్నియిన్ సెల్వన్. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, జయరాం, నాజర్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, లాంటి స్టార్ నటులు నటించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఒక పీరియాడికల్ కథ నేపథ్యం లో తెరకెక్కించారు. విక్రమ్ ఇటీవల కోబ్రా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ స్టారర్ మూవీ తో మళ్ళీ ఆకట్టుకుంటాడు అనే చెప్పాలి. ఇక త్రిష చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే కార్తీ, జయం రవి, లు కూడా ఈ సినిమాతో మొదటి పాన్ ఇండియా సినిమా.

కథ: ఈ సినిమా లో విక్రమ్ ఆదిత్య కరికాలన్ పాత్ర పోషించారు. ఐశ్వర్యరాయ్ నందినిగా అలాగే త్రిష కుందవై పిరిత్తియార్ పాత్రలో కనిపించారు. ఇక పరాంతక చోళుడు కు కుందవై, ఆదిత్య కరికాలన్, అరుల్ మోజి వర్మ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఆదిత్య రాజు అవ్వటంతో బంగారు భవనాన్ని నిర్మించుకుంటాడు. దీంతో తన తండ్రి పరాంతక చోళుడును తన దగ్గర ఉంచుకోవడానికి వందియతేవన్ ద్వారా తన తండ్రికి కబురు పంపిస్తాడు. అయితే వందియతేవన్ వెళ్తుండగా.. మధ్యలో కదంపూర్ అనే భవనంలో విశ్రాంతి తీసుకుంటాడు.

అక్కడ వందియతేవన్ చోళ రాజ కోశాధికారి పలువెట్టయ్య నేతృత్వంలో కరికాలనుకు వ్యతిరేకంగా చేసిన కుట్ర గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత కొడుకు రమ్మన్నాడు అన్న విషయాన్ని పరాంతక చోళుడికి చెబుతాడు. ఆ తర్వాత అరుల్ ను కూడా తీసుకొని రమ్మని కుందావై వందియతేవన్ ను శ్రీలంకకు పంపిస్తుంది. అదే సమయం లో అరుల్ మొలివర్మన్ ను బందీగా తీసుకురావాలి అని పలువెట్టరైయార్ శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు.

దీంతో అరుల్ ను తీసుకొని వస్తుండగా తుఫాను వల్ల ఓడలు చిక్కుకుంటాయి. ఇక ఆ సమయంలో అరుల్ ను ఒక జాలరి కాపాడుతుంది. అయితే అరుల్ అనారోగ్యం పాలవటంతో చికిత్స కోసం బౌద్ధ మందిరానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో ఆదిత్యను సింహాసనం నుంచి తప్పించి తన పినతండ్రి మధురాంతకన్‌ను గద్దె ఎక్కించాలనే పలువెట్టయార్ కుట్రలు చేస్తుంటారు.

ఇక ఈ కుట్రలో పలువెట్టయార్ భార్య నందిని కూడా ఉంటుంది. ఇక ఆదిత్య కరికలన్‌ను కదంబూర్ అనే ప్రాంతంలోని ఒక భవనంలోకి పిలిపించి ఆదిత్యను హత్య చేస్తారు. కానీ ఆ హత్య వందియతేవన్‌ చేశాడని నేరం అతడి పై పడుతుంది. ఆ తర్వాత తనపై పడిన నింద నుంచి వందియతేవన్ ఎలా బయటకువచ్చాడు? పలువెట్టయార్‌ ఎవరు? వందియతేవన్, కుందవై మధ్య ప్రేమకథ ఏమైంది? అన్నదే మిగతా కథ.

నటీనటుల పనతీరు: ఈ సినిమాలో అందరూ అనుభవం ఉన్న నటీనటులు ఉండడం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. అలాగే చాలా వరకు యాక్టర్లు తెలుగు లో కూడా సుపరిచితులు కావడం వల్ల తెలుగు ప్రేక్షకులలో కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. చియాన్ విక్రమ్ ఈ సినిమాలో చాలా విభిన్నంగా కనిపించాడు. ఐశ్వర్య రాయ్ నటన ఈ సినిమాకి ఊపిరి పోసింది.

త్రిష కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటించింది. జయం రవి, కార్తీ లు కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. కార్తీ నటనకు మాత్రం ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి స్కోప్ దొరికింది. ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ఆర్ శరత్ కుమార్ ల నటన కూడా చాలా బాగుంది. వెంకట్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, అశ్విన్ కాకుమాను, నాజర్ లు కూడా సినిమా లో బాగానే నటించారు. మిగతా నటినటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

విశ్లేషణ: తమిళ సినిమాలలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే సినిమా లోని విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

ఈ మధ్య కాలంలో తమిళ లో ఇలాంటి అదిరిపోయే విజువల్స్ ఉన్న సినిమా రాలేదు. ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడు మణి రత్నం చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం మాత్రమే కాకుండా సినిమా టేకింగ్ విషయంలో అది నిరూపిస్తూనే ఉన్నారని చెప్పాలి.

దర్శకుడు చెప్పాలి అనుకున్న కథ ను చాలా చక్కగా వెండి తెరపై చూపిస్తూ తన స్టైల్ మ్యాజిక్ ను కూడా క్రియేట్ చేసారు. కానీ కథనం విషయంలో మాత్రం మణిరత్నం కొంచెం శ్రద్ధ పెట్టినట్టు కనిపించలేదు. ఈ సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు.

భారీ బడ్జెట్ సినిమా కావడం తో నిర్మాణ విలువలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఏ ఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ అని చెప్పవచ్చు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా సెట్ అయింది.

అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే కేవలం నేపధ్య సంగీతం వల్లే రక్తికట్టాయి. సినిమాటోగ్రాఫర్ కూడా సినిమాకి అదిరిపోయే విజువల్స్ ను అందించాడు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. రన్ టైమ్ ఇంకొంచెం తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది.

ప్లస్ పాయింట్స్: నటీనటులు, నిర్మాణ విలువలు, సంగీతం

మైనస్ పాయింట్స్: రన్ టైం, కొన్ని సన్నివేశాలు మెల్లగా సాగినట్టు అనిపించింది.

రేటింగ్: 2.5/5

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -