Pooja Hegde: పూజా హెగ్డే దారుణమైన స్థితికి కారణం అతనేనా?

Pooja Hegde:తెలుగు ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకుంటున్న బుట్టుబొమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్ లో ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా మంచి పాపులారిటీని సంపాదించిన కన్నడ భామ పూజా హెగ్డే.. ఇప్పుడు తన కెరీర్ లో బెస్ట్ ప్రాజెక్టులను, అన్ని ఇండస్ట్రీల నుండి పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేజిక్కించుకుంటోంది. తెలుగులో టాప్ హీరోలతో సినిమా ఛాన్సులు కొట్టేస్తున్న ఈ భామ కొత్త ఫోటోలు అందరికీ షాకిస్తున్నాయి.

 

తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే.. వాకర్ సహాయంతో మెల్లిగా నడుస్తున్నట్లు కనిపించే ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎప్పుడు చలాకీగా కనిపించే పూజా హెగ్డే ఇలా ఎలా మారిపోయిందంటూ బాధపడుతున్నారు. పూజా హెగ్డే కాలికి గాయం కారణంగా కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేదు.

 

పూజా హెగ్డే దారుణంగా కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేకపోవడానికి కారణం ఏంటని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే దీనికి కారణం సల్మాన్ ఖాన్. అవును బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే ఓ సినిమా చేస్తోంది. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే సినిమా చేస్తుండగా.. ఆ సినిమా షూటింగ్ లో పూజా హెగ్డేకి గాయమైంది.

 

దీంతో ప్రస్తుతం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే తన కాలికి చికిత్స చేయించుకుంటున్న పూజా హెగ్డే వాకర్ సహాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తోంది. కొత్త ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే.. ‘నా జీవితంలో నడవం నేర్చుకోవడం ఇది రెండోసారి. ఎంతో ఫన్నీగా ఉంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో మరియు బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -