Pooja Hegde: పూజా హెగ్డే భర్తకు కావాల్సిన లక్షణాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Pooja Hegde: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలా వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూజ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన హవా కొనసాగిస్తోంది. పూజా హెగ్డే కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా కూడా ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘ కీసి కా భాయ్ కిసి కీ జాన్ ‘ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం షాహిద్ కపూర్ తో కలిసి ‘ కోయి శక్ ‘ అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తనని పెళ్లి చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లి లతా హెగ్డే తో కలిసి పాల్గొన్న పూజా హెగ్డే పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

ఈ క్రమంలో పూజ పెళ్లి గురించి ఆమె తల్లి మాట్లాడుతూ..” తనని అన్ని రకాలుగా అర్థం చేసుకుని వ్యక్తి కోసం పూజా ఎదురుచూస్తోంది. వివాహ బంధం కలకాలం నిలవాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఒకరి పట్ల ఒకరికి గౌరవం, నమ్మకం ఉండాలి. గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి జీవించటం చాలా కష్టం అంటూ తెలిపింది. అంతే కాకుండా పూజ చాలా సున్నిత మనస్కురాలు. అన్ని విషయాలలో ఆమెను ప్రోత్సహించేవాడు ఆమెకు భర్తగా రావాలి.

 

ముఖ్యంగా తన కెరీర్ విషయంలో ప్రోత్సాహం అందించే వ్యక్తి తనకు భర్తగా రావాలని నేను కోరుకుంటున్నాను అంటూ కూతురికి కాబోయే వ్యక్తి గురించి లతా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ క్రమంలో పూజ హెగ్డే స్పందిస్తూ..’ నా జీవితంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి నువ్వే. నీ కలలన్నీ నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను. నాకోసం నువ్వు చేసిన ప్రతి దానికి కృతజ్ఞతలు అంటూ తల్లి పట్ల ప్రేమ చూపిస్తూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -