Poonam Kaur: ఆబార్షన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. పూనమ్ కౌర్ ఏమన్నారంటే?

Poonam Kaur: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైన స్టైల్ లో స్పందించే వ్యక్తి పూనమ్ కౌర్. ఆమె చేసే వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు అప్పుడప్పుడు టాప్ అప్ ద ఇండస్ట్రీ గా సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను నెట్టింట్లో పంచుకుంటుంది.

ఇటీవల తెలుగు రాజకీయాల్లో కూడా ఈ అమ్మడు పేరు వెలుగులోకి వచ్చింది. ఇలా పలు వివాదాలను తట్టి లేపి.. కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటుంది అమ్మడు. ఇలా వెండితెరపై, సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ.. ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతుంది. ఇక పూనమ్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసి వివాదాస్పద బ్యూటీ గా పేరు తెచ్చుకుంది.

ఇదంతా పక్కన పెడితే మహిళల అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాన్ని తొలగించేందుకు మహిళలు వివాహితులు అయ్యుండాల్సిన అవసరం లేదని, అవివాకులైన గర్భం తొలగించుకోవచ్చని సుప్రీంకోర్టు నిర్ణయానికి వచ్చింది. చట్టపరమైన అబార్షన్ కు మహిళలు ఎవరైనా అర్హులే అని వెల్లడించింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పూనమ్ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేసింది. గర్భం దాల్చిన తర్వాత పురుషులు తమ రిలేషన్ కు కట్టుబడి ఉండమని బలవంతం చేయడం నేను చూశాను అని తెలిపింది.

స్త్రీలు పెళ్లిని ఆర్థిక భద్రతను కాపాడుకోనేందుకు గర్భం దాల్చడం చూసానని పూనమ్ తెలిపింది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితమంతా బాధపడాల్సి వస్తుందన్నారు. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధాలుగా ఉపయోగించకూడదు అని సూచించారు పూనమ్. పూనం ప్రస్తుతం చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -