Poonam Kaur: ఎమోషనల్ అయిన పూనమ్ కౌర్.. అలా వెలివేయొద్దంటూ?

Poonam Kaur: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. పూనం కౌర్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా వివాదాల ద్వారానే బాగా పాపులర్ అయ్యిందన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తరచు వివాదాల్లో నిలిచే హీరోయిన్లలో పూనం కౌర్ కూడా ఒకరు. ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి పూనమ్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాజాగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ రాజ్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాంలో ఆమె మాట్లాడుతూ..

 

నేను పంబాబీని అని, సిక్కుని అని మ‌తం పేరు మీద న‌న్ను తెలంగాణ నుండి వేరుచేద్దాం అని చూస్తున్నారు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణ బిడ్డని. నా మతం పేరు చెప్పి నన్ను దూరం చేయవద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతోందని సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత కావాలి అని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ముంబై నుంచి వచ్చినవారికే ప్రాధన్యాత ఇస్తున్నారని వాపోయారు.

ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో పూనమ్ కౌర్ రాజకీయపరంగా సినిమా పరంగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ తరచూ ఎవరో ఒకరిపై విమర్శలు గుప్పిస్తూ వార్తలు నిలిచిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కువగా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటుంది పూనమ్ కౌర్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -