Poorna: గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ..వీడియో షేర్ చేసిన నటి

Poorna: తెలుగు తెరపై ఇప్పుడంతా హీరోయిన్ల హవా నడుస్తోంది. ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా హీరోయిన్లు నిలుస్తున్నారు. తాజాగా నటి పూర్ణ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. పూర్ణ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు బుల్లితెర షోలలో కనిపిస్తోంది. కెరీర్ పరంగా ఆమెకు ఎటువంటి డోకా లేదు. ఈ మధ్యనే ఆమె పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా నటి పూర్ణ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ను చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

 

మలయాళ నటి అయిన పూర్ణ, ‘శ్రీమహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ గా ‘సీమటపాకాయ్’, అవును, అవును 2, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాల్లో కనిపించింది. ఇకపోతే రాజుగారి గది, శ్రీమంతుడు, సిల్లీ ఫెలోస్, అదిగో, సువర్ణ సుందరి, పవర్ ప్లే, తీస్ మార్ ఖాన్, అఖండ, దృశ్యం 2 లాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించింది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమాలోనూ ఓ పాత్ర చేస్తోంది.

 

ఇటు సినిమాలు చేస్తూనే మరోవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలల్లో జడ్జిగా చేస్తోంది. గతేడాది జూన్ నెలలో 12వ తేదిన దుబాయి బిజినెస్ మేన్ అయిన అసిఫ్ అలీని ఆమె వివాహం చేసుకుంది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత సినిమాలకు, షోలకు దూరమవుతూ వచ్చిందని చెప్పాలి.

 

తాజాగా నటి పూర్ణ తాను తల్లి కాబోతున్నట్లు ఓ శుభవార్తను తెలియజేసింది. దానికి సంబంధించిన విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చేసుకున్న షేర్ చేసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. పూర్ణకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -