Post Office Scheme: పోస్టఫీస్‌లో వంద పెట్టుబడి పెడితే లాభాలెన్నో..

Post Office Scheme: నేటి సమాజంలో డబ్బుంటేనే జీవితం ముందుకు సాగుతోంది. ప్రపంచంమంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. అందుకే డబ్బులు సంపాదించేందుకు ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కుంటారు. తల్లిదండ్రులు రాత్రింబవళ్లు కష్టపడి తమ పిల్లల భవిష్యత్‌ కోసం డబ్బులు సంపాదించి దాచిపెడుతుంటారు. వివిధ బ్యాంకులు, ప్రభుత్వ పథకాల్లో పొదుపు చేస్తుంటారు. సంపాదించిన డబ్బులను ఇష్టానుసారంగా ఖర్చుచేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని ఓ పద్ధతిలో పొదుపుచేస్తే భవిష్యత్‌లో చాలా ఉపయోగపడుతోంది. అయితే.. మనం సంపాదించిన డబ్బులను ఎలా పొదుపు చేయాలి..

ఎక్కడ పొదుపు చేయాలంటే వీటిని చదవండి..

1.ఎలాంటి శ్రమ, రిస్క్‌ లేకుండా ఉండాలంటే పోస్టíఫీసుల్లో వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉంటాయి.వాటిలో మీకు ఇష్టమైన పథకంలో డబ్బులను పొదుపు చేయవచ్చు.
2.కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఎస్‌సీ). ఇది చాలా ముఖ్యమైన సేఫ్‌ పెట్టుబడి ఆప్షన్‌. దీని ద్వారా వచ్చే రాబడికి ఎలాంటి ట్యాక్స్‌ ఉండదు.
3.ఈ పథకంలో ప్రతి నెల రూ.100 నుంచి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరితే కొన్ని ఏళ్లలో మీకు భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి.
4. నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ పథకం 5 ఏళ్లు ఉంటుంది. మీకు అత్యవసరం అయితే ఏడాదికే మీ డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
5.ఈ పథకంలో 2021–22 నుంచి 6.8 శాతం వడ్డీ కూడా ఇస్తున్నారు. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్నుచట్టంలో సెక్షన్‌80–సీ ద్వారా రూ.1.5 లక్షల దాకా పన్ను మినాహాయింపు కూడా ఉంటుంది.
6. అలాగే 6 నెలలక ఒక్కసారి మీ ఖాతాలో డబ్బులు సేమ్‌ అవుతాయి. ఈ పథకంలో మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 7 లక్షలు పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -