Prabhas-Balayya: బాలయ్యపై ప్రభాస్ కు ఇంత ప్రేమా.. అన్ని వంటకాలతో?

Prabhas-Balayya: “వీడు ఎక్కడున్నా రాజేరా” ఇది ప్రభాస్ సూపర్ హిట్ మూవీ బాహుబలిలో ఒక సన్నివేశంలో డైలాగ్. అయితే నిజజీవితంలోనూ ఇది వందకు వంద శాతం నిజం అని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. ప్రభాస్ మనస్సు చాలా మంచిదని, తన చుట్టూ ఉండేవాళ్ళపై ప్రభాస్ చూపించే ప్రేమ అంతా ఇంతా కాదని దగ్గరి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఏదైనా సమస్య వచ్చినా, ప్రకృతి విపత్తులు సంభవించినా పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం అందిస్తారు ప్రభాస్.

 

ఈ మధ్యే ప్రభాస్ గారు కృష్ణం రాజు గారిని కోల్పోయారు. ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాడు ప్రభాస్. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ షో సీజన్ 2 లో గోపిచంద్ తో కలిసి అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆ రోజు హాజరైన సెట్ మొత్తానికి విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

బాలయ్య కోసం భలే భలే వంటకాలు.
ప్రభాస్ ఇచ్చిన విందులో బాలయ్య బాబు కోసం ప్రత్యేకంగా వంటకాలు చేయించుకుని వచ్చారంట ప్రభాస్. ఒక పెద్ద లిస్ట్ వంటకాలు ప్రత్యేకంగా చేయించుకుని బాలయ్యకు స్పెషల్ విందు ఇచ్చినట్టు తెలుస్తోంది. అభిమానులకు, ప్రేక్షకులకు కూడా మంచి మంచి వంటకాలతో విందు ఇచ్చాడంట. దీనితో ప్రభాస్ ఎక్కడున్నా రాజేరా.. అనే విషయం మరోసారి నిరూపితం అయ్యిందంటూ మాట్లాడుకుంటున్నారంట జనాలు.

 

బాలయ్యకు ఇష్టమైన వంటకాల జాబితా కనుక్కొని మరీ ఆ వంటకాలను ప్రభాస్ ప్రత్యేకంగా తయారు చేయించాడట. ఇక ఈ విషయం బయటికి రావడంతో అటు బాలయ్య అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ విందు మెనులో.. మటన్ బిర్యానీ, పీతల ఇగురు, చేపల పులుసు, మటన్ కర్రీ, చికెన్ తో పాటు మరెన్నో స్పీస్ల ఐటమ్స్ ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటే వెజ్ ఐటమ్స్.. సాంబార్, పప్పు, ఆవకాయ్ లాంటి పదార్దాలు తెచ్చారంట. ఇదిలా ఉంటే ఈ ఎపిపోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -